పోటా పోటీగా విడుదలకు సిధ్దమైన శ్యామ్‌సంగ్, మోటరోలా

Posted By: Super

పోటా పోటీగా విడుదలకు సిధ్దమైన శ్యామ్‌సంగ్, మోటరోలా

ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో తక్కువ ధర కలిగిన మొబైల్ ఎక్కువ సంఖ్యలో విడుదలతున్నాయి. ఈ మొబైల్స్‌ని విడుదల చేసేటటువంటి కంపెనీలలో దేశీయ మొబైల్ కంపెనీలు, అంతర్జాతీయ మొబైల్ కంపెనీలు ఉన్నాయి. యూజర్స్ యొక్క అభిరుచులకు అనుగుణంగా మొబైల్ తయారీదారులు బెస్ట్ హ్యాండ్ సెట్స్‌ని విడుదల చేస్తున్నారు. తక్కువ ధరలో యూజర్స్ కోసం డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన డ్యూయల్ సిమ్ మొబైల్స్ ఫోన్స్ మోటరోలా ఈఎక్స్ 212, శ్యామ్‌సంగ్ మెట్రో సి3752 గురించి తెలుసుకుందాం. శ్యామ్‌సంగ్ మెట్లో సి3752 ప్లిప్ టైపు మోడల్. 2.4 ఇంచ్ ఇంచ్ QVGA డిస్ ప్లే‌తో పాటు, 320 x 240 ఫిక్సల్ స్క్రీన్ రిజల్యూషన్‌గా రూపోందిచబడింది. మోటరోలా ఈఎక్స్ 212 కూడా స్క్రీన్ సైజు విషయంలో ఒకే విధంగా రూపోందించబడింది. మోటరోలా ఈఎక్స్ 212 మొబైల్ 2 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు డిజిటల్ జూమ్ ఫెసిలిటీని కలిగి ఉంది. ఐతే శ్యామ్‌సంగ్ మెట్రో సి3752 కెమెరా మాత్రం మోటరోలాతో పోల్చితే ఎక్కువ. శ్యామ్‌సంగ్ మెట్రో సి3752 3.2 మెగాఫిక్సల్ కెమెరాతో పాటు క్లారిటీ వీడియోస్‌ని తీయగలుగుతుంది.

ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే యూజర్స్‌ను ఎటువంటి నిరాశకు గురిచేయవు. మార్కెట్లో ప్రస్తుతం లభ్యమవుతున్న అన్నిరకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి. రెండు మొబైల్స్ కూడా బయట స్పీకర్స్‌కి కనెక్ట్ చేసుకునేందుకు గాను 3.5 mm ఆడియో జాక్ మొబైల్‌తో పాటు లభిస్తుంది. రెండు మొబైల్స్‌లలో కూడా మొబైల్ తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా, మొమొరీని ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా విస్తరించుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలైన బ్లూటూత్, వై-పైలను కూడా సపోర్ట్ చేస్తాయి.

శ్యామ్‌సంగ్ మెట్రో సి3752 మొబైల్ 900 mAh బ్యాటరీని కలిగిఉండడం వల్ల టాక్ టైం 11గంటలు పాటు వస్తుంది. అదే మోటరోలా ఈఎక్స్212 బ్యాటరీ కెపాసిటీ 750 mAh. రెండు మొబైల్స్‌ని తయారు చేసిన మొబైల్ తయారీదారులు వేరు కాబట్టి వీటి ధరలు కూడా వేరుగానే ఉన్నాయి. మోటరోలా ఈఎక్స్ 212 మొబైల్ ధర రూ 4220 ఉండగా, శ్యామ్‌సంగ్ మెట్లో సి3752 ధర మాత్రం రూ 5270గా మొబైల్ మార్కెట్లో నిర్ణయిండమైంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot