మోటో నుంచి రేజర్ పేరుతో ఫోల్డబుల్ ఫోన్

By Gizbot Bureau
|

మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న దిగ్గజం మోటోరోలా నుంచి మడతపెట్టే స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. 'మోటో రేజర్ 2019' పేరుతో ఈ కొత్త ఫోన్‌ను మోటోరోలా పరిచయం చేసింది. గత కొంత కాలం నుంచి ఈ ఫోన్ మీద చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. లీకులతో ఈ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే శాంసంగ్ నుంచి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ఇప్పుడు మోటరోలా ఫ్లిప్ ఫోన్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ మడతపెట్టినప్పుడు సెల్ఫీలు, నోటిఫికేషన్స్, మ్యూజిక్ , గూగుల్ అసిస్టెంట్ లాంటి ఫీచర్స్ వాడుకోవడానికి చిన్న డిస్‌ప్లే కూడా ఉంటుంది. ఇందులో సిమ్ కార్డ్ స్లాట్ ఉండదు. ఇసిమ్ ద్వారా నెట్‌వర్క్ సేవలు ఉపయోగించుకోవాలి.

ఫీచర్లు - స్పెసిఫికేషన్లు
 

ఫీచర్లు - స్పెసిఫికేషన్లు

Moto Razr రెండు స్ర్కీన్లు , ఫ్లెక్సిబుల్ pOLED డిస్‌ప్లే, 6.2 అంగుళాల సైజు ,21:9 సినిమావిజన్ అస్పెక్ట్ రేషియో,2.7-అంగుళాల gOLED డిస్‌ప్లే, ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ (కిందివైపు), 16MP కెమెరా (సెల్ఫీలు- అన్ ఫోల్డెడ్), 16MP రియర్ కెమెరా (ఫోల్డెడ్) , 5MP కెమెరా (లోపల) అన్ ఫోల్డెడ్), స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్, 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరజీ, 2510mAh బ్యాటరీ, 15W క్విక్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 9 పై OS

ధర

ధర

అమెరికాలో 2020 జనవరి 9న అందుబాటులోకి రానుంది. 2019 డిసెంబర్ 26న ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయి. ధర 1,499.99 డాలర్లు. అంటే ఇండియాలో సుమారు రూ.1,07,500 ధర ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ మాదిరి..

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ మాదిరి..

ఇటీవల ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ మాదిరిగా ఫోల్డబుల్ ఫోన్ అయి ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇప్పటిక Moto Razr ఫోన్ లాంచింగ్ విషయమై రిజిస్ట్రేషన్ పేజీ క్రియేట్ చేసింది. కొన్నివారాలు లేదా నెలల్లో భారత మార్కెట్లోకి రానుంది.

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫీచ‌ర్లు
 

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫీచ‌ర్లు

ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 7.3 ఇంచుల ఇన్పినిటీ ఫ్లెక్స్ డైన‌మిక్ అమోలెడ్ డిస్ ప్లే, 4.6 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌, 4380 ఎంఏహెచ్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అయితే ఈ ఫోన్‌లో ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్ లేదు. అలాగే ఇందులో వెనుక భాగంలో 16, 12, 12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు, 10 మెగాపిక్స‌ల్ క‌వ‌ర్ కెమెరా ఉన్నాయి. అయితే ఈ ఫోన్‌ను ఎలా ప‌ట్టుకున్నా చాలా వేగంగా కెమెరాను ఓపెన్‌ చేసి ఫొటోలు తీసుకునే సౌక‌ర్యం క‌ల్పించారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Moto Razr (2019) launched, sports two screens - one foldable

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X