Home
Mobile

రూ.6999 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.6 అంగుళాల డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌..!

మోటోరోలా సంస్థ మే నెలలో భారత్‌ మార్కెట్‌ లో మోటోరోలా G04s స్మార్ట్‌ఫోన్‌ ను (Motorola G04s Smartphone) విడుదల చేసింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఇతర ఆఫర్లతో మరింత డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంక్‌ కార్డు ద్వారా కూడా డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 50MP ప్రధాన కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ప్రస్తుతం మోటోరోలా G04s స్మార్ట్‌ఫోన్‌ ధర : ప్రస్తుతం మోటోరోలా G04s స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.6999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. కాంకర్డ్‌ బ్లాక్‌, సీ గ్రీన్‌, శాటిన్‌ బ్లూ, సన్‌రైజ్‌ ఆరెంజ్‌ రంగుల్లో లభిస్తుంది.

Motorola G04s Smartphone

మోటోరోలా G04s స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
మోటోరోలా G04s స్మార్ట్‌ఫోన్ 1612*720 పిక్సల్‌ రిజల్యూషన్‌తో కూడిన 6.6 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 537 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంటుంది.

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ : ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. మరియు LED ఫ్లాష్‌ లైట్‌ ను అమర్చారు. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 5MP కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 15W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

మోటోరోలా G04s స్మార్ట్‌ఫోన్‌ Unisoc T606 SoC చిప్‌ సెట్‌ పైన పనిచేస్తుంది. Mail G57 GPU చిప్‌సెట్‌, 8GB LPDDR4X ర్యామ్‌ మరియు 64GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. మైక్రో SD కార్డు ద్వారా ఫోన్‌ స్టోరేజీని పెంచుకొనే వీలుంది.

కనెక్టివిటీ పరంగా మోటోరోలా G04s స్మార్ట్‌ఫో న్‌ 4G LTE, బ్లూటూత్ 5.0, Wi-Fi 802, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. IP52 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌ ఫీచర్‌ను కలిగి ఉంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola G04s Smartphone is available for purchase at rs6999 on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X