Home
Mobile

రూ.8999 ధరకు 50MP కెమెరా, 7000mAh భారీ బ్యాటరీ, వేగాన్ లెదర్‌తో ఫోన్‌!

Motorola G06 Power Smartphone : భారత్‌ మార్కెట్‌ లో ఇటీవల కాలంలో చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు భారీ బ్యాటరీలతో లాంచ్‌ అవుతున్నాయి. ఇందులో బడ్జెట్‌, మిడ్‌రేంజ్‌, ప్రీమియం ఫోన్‌ లు ఉన్నాయి. అయితే గత సంవత్సరం అక్టోబర్‌ లో ఎంట్రీ లెవల్ ధరలో అందుబాటులోకి వచ్చిన మోటో Go6 పవర్‌ స్మార్ట్‌ఫోన్ కూడా 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు భారీ బ్యాటరీ, వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌ ను కూడా కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ రూ.9 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

రూ.8999 ధరకే :
భారత్‌ మార్కెట్‌ లో ప్రస్తుతం మోటో G06 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌ లో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8999 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ పాంటోన్‌ టేప్‌స్ట్రీ, పాంటోన్ లారెల్‌ ఓక్‌, పాంటోన్‌ టెండ్రిల్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

Motorola G06 Power

వేగాన్ లెదర్‌ బ్యాక్‌ ప్యానల్‌ :
మోటో G06 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 600 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్, 395ppi పిక్సల్‌ డెన్సిటీతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ బ్యాక్ ప్యానల్‌ వేగాన్‌ లెదర్‌ ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ ఉంది.

మీడియాటెక్‌ చిప్‌ :
ఈ మోటోరోలా ఫోన్ మీడియాటెక్‌ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్‌ SoC చిప్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది. మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది. గూగుల్‌ జెమిని AI అసిస్టెంట్‌ ను కలిగి ఉంది.

50MP కెమెరా, 7000mAh బ్యాటరీ :
ఈ మోటో హ్యాండ్‌సెట్‌ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, మరో లెన్స్‌ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. 18W ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది.

మోటోరోలా G06 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ IP64 రేటింగ్‌ తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. భద్రత కోసం సైడ్‌ మౌంటెండ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఉంది. 4G, వైఫై, బ్లూటూత్ 6.0, USB-C ఛార్జింగ్‌ పోర్టు ఉంది. ప్రాక్సిమిటీ సెన్సర్‌, యాంబియంట్‌ లైట్ సెన్సర్‌, యాక్సెలిరోమీటర్‌ సెన్సర్‌ లు ఉన్నాయి.

మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌ సేల్‌ ఇటీవల ప్రారంభం అయింది. 6.78 అంగుళాల 1.5K సూపర్‌ HD+ క్వాడ్ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 4 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత Hello UI పైన పనిచేస్తుంది. 50MP, 13MP, 32MP కెమెరాలున్నాయి. 68W ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola G06 Power smartphone with 7000mAh battery now available at Rs8999 price on Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X