Home
Mobile

రూ.9999 కే 128GB స్టోరేజీ, స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌..!

మోటోరోలా బడ్జెట్ సెగ్మెంట్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలు ఇటీవల తగ్గాయి. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్ డేస్‌ 2025 సేల్‌లో మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ల ధరలు తగ్గుతాయని భావిస్తున్నా.. అంతే కంటే ముందుగానే కొన్ని మోడల్స్‌ ధరలు తగ్గాయి. ఇటీవలే మోటోరోలా G35 5G స్మార్ట్‌ఫోన్‌ రూ.8999 కే అందుబాటులోకి వచ్చింది. మరో మోటోరోలా ఫోన్ G45 5G మోడల్‌ ను రూ.10 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

మోటోరోలా G45 5G స్మార్ట్‌ఫోన్‌ :
మోటోరోలా G45 5G స్మార్ట్‌ఫోన్‌ (Motorola G45 5G Smartphone) 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9999 కే కొనుగోలు చేయవచ్చు. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.11999 కు కొనుగోలు చేయవచ్చు.

Motorola G45 5G smartphone

అల్ట్రా ప్రీమియం వేగాన్‌ లెదర్‌ డిజైన్‌ :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను పొందుతోంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఈ ఫోన్ అల్ట్రా ప్రీమియం వేగాన్‌ లెదర్‌ డిజైన్‌ను కలిగి ఉంది.

స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌ :
మోటోరోలా G45 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 3 ప్రొసెసర్‌ పైన పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 14 OS ను కలిగి ఉంది. ఈ మోటో స్మార్ట్‌ఫోన్ ఒక సంవత్సరం ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని మోటో సంస్థ తెలిపింది.

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం భాగంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. బ్రిలియంట్ బ్లూ, బ్రిలియంట్‌ గ్రీన్‌, పర్పుల్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది.

* మోటోరోలా G35 5G స్మార్ట్‌ఫోన్‌ :
మరో స్మార్ట్‌ఫోన్ మోటోరోలా G35 5G స్మార్ట్‌ఫోన్‌ ధర కూడా డిస్కౌంట్‌ ధరకు అందుబాటులోకి వచ్చింది. మోటో G35 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999 గా ఉండేది. ఇటీవలే రూ.1000 ధర తగ్గించి. ఫలితంగా రూ.8999 కే కొనుగోలు చేయవచ్చు. మిడ్‌నైట్‌ బ్లాక్‌, లీఫ్‌ గ్రీన్‌, గువా రెడ్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

మోటోరోలా G35 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.72 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ Unisoc T760 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI తో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ మరియు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

మోటో స్మార్ట్‌ఫోన్ 20W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP52 రేటింగ్‌తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Motorola G45 5G smartphone now available at Rs9999 price on flipkart full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X