Home
Mobile

మోటోరోలా నుంచి G సిరీస్‌లో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదల.. ఫీచర్‌లు, ధర పూర్తి వివరాలు..!

మోటోరోలా నుంచి తాజాగా G56, G86, G86 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. G86, G86 పవర్‌ ఫోన్‌లు MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌లు కలిగి ఉన్నాయి. డిజైన్‌, కలర్ వేరియంట్‌ పరంగా ఈ G సిరీస్‌ ఫోన్‌లు ఆకట్టుకొనే అవకాశం ఉంది. ఈ మూడు ఫోన్‌లలో బ్యాటరీ పరంగా మార్పులను గమనించవచ్చు. మిగిలిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు ఒకే మాదిరిగా ఉన్నాయి.

* మోటోరోలా G56 స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ ఫోన్‌ (Motorola G56 Smartphone) 6.72 అంగుళాల ఫుల్‌ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 391 ppi పిక్సల్‌ డెన్సిటీను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

Motorola G56  G86 and G86 Power smartphones

ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS ను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 600 OIS కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌తోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 30W టర్బోపవర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

* మోటోరోలా G86, G86 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు :
ఈ రెండు ఫోన్‌లు చాలా వరకు ఒకే తరహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌లు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల సూపర్‌ HD అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌, 446 ppi పిక్సల్‌ డెన్సిటీ, 20:9 ఆస్పెక్ట్‌ రేషియోను కలిగి ఉంది.

ఈ G86, G86 పవర్‌ ఫోన్లు గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతాయి. మరియు 100 శాతం DCI P3 కలర్‌ gamut కవరేజీ తోపాటు HDR10+ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తాయి.

మోటోరోలా G86 స్మార్ట్‌ఫోన్‌ (Motorola G86 Smartphone) మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. అదే G86 పవర్‌ (Motorola G86 Power Smartphone) స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 12GB ర్యామ్, 512GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

50MP ప్రైమరీ, 32MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ రెండు ఫోన్‌లు ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి.

6720mAh బ్యాటరీ :
మోటోరోలా G86 స్మార్ట్‌ఫోన్‌ 30W వైర్‌ టర్బోపవర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అదే G86 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ 30W టర్బోపవర్ వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6720mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

మోటోరోలా G సిరీస్‌ ఫోన్‌ ధర వివరాలు :
మోటోరోలా G56 ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియట్‌ ధర GBP 199.00 (భారత్ కరెన్సీ ప్రకారం రూ.22900) గా ఉంది. ఈ ఫోన్‌ గ్రే మిస్ట్, బ్లాక్ ఓయిస్టర్‌, డాజ్లింగ్‌ బ్లూ, డిల్‌ వంటి నాలుగు కలర్‌ వేరియంట్స్‌ లభిస్తుంది.

మోటోరోలా G86 ప్రారంభ ధర GBP 280 (భారత్‌ కరెన్సీ ప్రకారం రూ.32,200) గా ఉంది. అదే మోటో G86 పవర్ ఫోన్‌ ధర GBP 299.99 (భారత్‌ కరెన్సీ ప్రకారం రూ.34,500) గా ఉంది. ప్రస్తుతం ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లను మోటోరోలా UK వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం ఈ మోటోరోలా G సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ UK సహా కొన్ని దేశాల్లోనే అందుబాటులో ఉన్నాయి. భారత్‌ మార్కెట్‌ల ఎప్పుడు లాంచ్‌ కానున్నాయో తెలియలేదు. స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల పరంగా ఏమైనా మార్పులు ఉండనున్నాయా లేదా తెలియాల్సి ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola G56, G86 and G86 Power smartphones launched here are the specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X