ధర రూ.13999 కే 128GB స్టోరేజీ, 6000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ సేల్ పూర్తి వివరాలు..!
మోటోరోలా నుంచి ఏప్రిల్‌లో నెలలో మోటోరోలా G64 5G స్మార్ట్ ఫోన్ (Motorola G64 5G smartphone Price Drop) విడుదల అయింది. అయితే కేవలం రెండు నెలల్లోనే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్ సెట్ మెరుగైన స్పెసిఫికేషన్ లు, డిజైన్ లు కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్‌తోపాటు 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
మోటోరోలా G64 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు SBI క్రెడిట్ కార్డు, ICICI బ్యాంకు, యాక్సెస్ బ్యాంకు కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. మరియు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

మోటోరోలా G64 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
మోటోరోలా G64 5G స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2400 పిక్సల్ రిజల్యూషన్ సహా 120Hz రీఫ్రెష్ రేట్‌తో తో అందుబాటులోకి వచ్చింది. డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్ రక్షణను పొందుతుంది.
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తోంది. గరిష్ఠంగా 12GB ర్యామ్, 256GB గరిష్ఠ అంతర్గత స్టోరేజీతో జతచేయబడి ఉంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
మోటోరోలా G64 5G స్మార్ట్‌ఫోన్ f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), PDAF (ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్) సపోర్టును కలిగి ఉంది. మరియు f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. ఈ లెన్స్ ద్వారా మ్యాక్రో ఫోటోలను కూడా క్యాప్చర్ చేయవచ్చు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు.
ఈ ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్ సెట్ 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్ 5.3, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు్‌ను కలిగి ఉంది. IP52 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా లాంచ్ అయింది. ఈ మోటో కొత్త స్మార్ట్‌ఫోన్ 192 గ్రాముల బరువు ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications