Home
Mobile

ధర రూ.12999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌..!

భారత్‌ మార్కెట్‌ లో గత సంవత్సరం ఏప్రిల్‌ లో మోటోరోలా మిడ్‌రేంజ్‌ ధర సెగ్మెంట్‌ లో మోటోరోలా G64 5G స్మార్ట్‌ఫోన్‌ ను (Motorola G64 5G Smartphone price drop) విడుదల చేసింది. రూ.15000 ధర రేంజ్‌ లో అందుబాటులోకి వచ్చిన ఈ హ్యాండ్‌సెట్‌ ను ప్రస్తుతం డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 6000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. మరియు FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ ల పూర్తి వివరాలు.

స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు :
మోటోరోలా G64 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌ లో ఉంది. విడుదల సమయంలో 8GB ర్యామ్ ధర రూ.14,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) లో ఈ ఫోన్‌ పై డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

Motorola G64 5G smartphone

రూ.1000 డిస్కౌం ట్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.13,999 గా ఉంది. అయితే అన్ని బ్యాంకు కార్డులపై రూ.1,000 తగ్గింపు ఆఫర్‌ అందుబాటులో ఉంది. అంటే ఫోన్‌ ను రూ.12,999 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఫ్లి్ప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డులతో 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ ను పొందవచ్చు. మింట్‌ గ్రీన్‌, ఐస్‌ లిలక్‌, పెరల్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

మోటోరోలా G64 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఈ మోటోరోలా హ్యాండ్‌సెట్‌ 6.5 అంగుళాల (1080*2400 పిక్సల్స్‌) FHD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్ రక్షణను పొందుతుంది.

చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ OS వివరాలు :
ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్‌ తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 12GB ర్యామ్‌, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 అప్‌డేట్‌తోపాటు 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌ లను అందిస్తామని మోటో తెలిపింది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌, OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, f/2.2 అపేచర్‌ తో 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చి ఉంది.

6000mAh బ్యాటరీ :
ఈ మోటో ఫోన్‌ 33W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్‌ 5.3, NFC, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టు్‌ను కలిగి ఉంది. డాల్బీ అట్మాస్‌ తో కూడిన డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.

గ్లాస్ ఫినిష్‌ :
ఈ ఫోన్‌ IP52 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. థింక్‌షీల్డ్, మోటో సెక్యూర్‌, ఫ్యామిలీ స్పేస్ 2.0 వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. అయితే ఈ ఫోన్‌ వెనుక వైపు గ్లాస్ తరహా ఫినిష్‌ను కలిగి ఉంది. దీంతోపాటు అల్యూమినియం కెమెరా హౌసింగ్ ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola G64 5G smartphone gets rs1000 discount on flipkart in india in 2025 February
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X