Home
Mobile

బడ్జెట్‌ ధరలో 7000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో ఫోన్‌!

మోటోరోలా సంస్థ భారత్ మార్కెట్‌ లో భారీ బ్యాటరీతో పవర్‌ పేరుతో అనేక ఫోన్‌లను తీసుకొచ్చింది. ఇందులో మోటో G86 పవర్, G06 పవర్‌, G67 పవర్‌, G57 పవర్‌ ఫోన్‌లు ఉన్నాయి. ఇందులో మోటో G67 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ను ప్రస్తుతం రూ.16999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే మోటో వెబ్‌సైట్‌లో భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 50MP కెమెరా, 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ మోటో ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

రూ.16999 ప్రారంభ ధరకు :
భారత్‌ మార్కెట్‌ లో మోటోరోలా G67 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ (Motorola G67 Power 5G Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18999 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

Motorola G67 Power 5G Smartphone

మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌ లో ఈ ఫోన్‌ కొనుగోలుపై ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.2500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు మొబైల్ వాలెట్‌, UPI లావాదేవీలపై డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌, వేగాన్ లెదర్‌ ఫినిష్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ MIL 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు బ్యాక్‌ ప్యానల్‌ వేగాన్ లెదర్‌ ఫినిష్‌ తో అందుబాటులో ఉంది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.7 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ కంటెంట్‌ను సపోర్టు చేస్తుంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.

స్నాప్‌డ్రాగన్ చిప్‌, 3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 2 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. Adreno GPU కూడా ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hello UX OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP సోనీ కెమెరా, 7000mAh భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్‌ 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. 30W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, మరో లెన్స్‌ ఉన్నాయి. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరా ఉంది.

కలర్‌ వేరియంట్స్ :
మోటోరోలా G67 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్ పాంటోన్‌ పారాచుట్‌ పర్పుల్‌, పాంటోన్‌ బ్లూ కురాకో, పాంటోన్‌ సిలింట్రో కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. సెక్యూరిటీ కోసం ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్ ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌, Wi-Fi, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola G67 Power 5G Smartphone with 7000mAh battery, 50MP Camera now at budget price on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X