బడ్జెట్ ధరలో 7000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, వేగాన్ లెదర్ ప్యానల్ 5G ఫోన్..!
మోటోరోలా సంస్థ ఈ సంవత్సరం భారత్ మార్కెట్ లో పవర్ పేరుతో అనేక స్మార్ట్‌ఫోన్ లను లాంచ్ చేసింది. ఇందులో మోటో G86 పవర్, మోటో G06 పవర్, మోటో G67 పవర్, మోటో G57 పవర్ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. మోటో G67 పవర్ 5G హ్యాండ్‌సెట్ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్ లు, ఫీచర్లు, సేల్ వివరాలు.
ధర, సేల్ వివరాలు :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఫోన్ (Motorola G67 Power 5G Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. మోటోరోలా వెబ్‌సైట్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను అందిస్తోంది.

వేగాన్ లెదర్ ఫినిష్, మిలిటరీ గ్రేడ్ డ్రాప్ ప్రొటెక్షన్ :
మోటో G67 పవర్ 5G స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానల్ వేగాన్ లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంది. MIL 810H మిలిటరీ గ్రేడ్ డ్రాప్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. పాంటోన్ పారాచుట్ పర్పుల్, పాంటోన్ సిలింట్రో, పాంటోన్ బ్లూ కురాకో కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 391 ppi పిక్సల్ డెన్సిటీ, HDR10+ సపోర్టును కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా 7i ప్రొటెక్షన్‌ను పొందుతోంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్ ను కలిగి ఉంది. దీంతోపాటు Adreno GPU ను కూడా అమర్చారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UX పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్‌తోపాటు 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని మోటోరోలా హామీ ఇచ్చింది.
50MP సోనీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా :
మోటోరోలా G67 పవర్ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్, 2 ఇన్ 1 ఫ్లిక్కర్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలు 30fps వద్ద FHD రిజల్యూషన్ వీడియోలను రికార్డు చేయవచ్చు.
7000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ 30W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 5G, 4G, వైఫై, బ్లూటూత్ 3.1, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సర్, ఇ-కంపాస్, యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సర్, SAR సెన్సర్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications