Home
Mobile

FHD+ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో 5G స్మార్ట్‌ఫోన్‌.. ధర రూ.16999..!

మోటోరోలా నుంచి భారత్‌ మార్కెట్‌ లో అనేక బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ లు అందుబాటులో ఉన్నాయి. ఎంట్రీ లెవల్‌ నుంచి ఫ్లాగ్‌షిప్‌ వరకు అనేక హ్యాండ్‌సెట్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం G85 5G స్మార్ట్‌ఫోన్‌ ను (Motorola G85 5G Smartphone) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ఈ ఆఫర్‌ ను అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఈ హ్యాండ్‌సెట్‌ 5000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. 3D కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. నాలుగు రంగుల్లో ఈ హ్యాండ్‌సెట్‌ అందుబాటులో ఉంది. గత సంవత్సరం జులైలో లాంచ్‌ అయింది.

మోటోరోలా G85 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌ లో లభిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ విడుదల సమయంలో ఫోన్ ప్రారంభ ధర (8GB ర్యామ్‌ వేరియంట్) రూ.17,999 గా ఉండేది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.19,999 గా ఉంది.

Motorola G85 5G smartphone

ఫ్లిప్‌కార్ట్‌ అన్ని బ్యాంకుల క్రెడిట్‌ కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.16,999 గా ఉంది. హై ఎండ్‌ వేరియంట్‌ ను రూ.18,999 కే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ను పొందవచ్చు. అర్బన్ గ్రే, వివా మజెంటా, కోబాల్ట్‌ బ్లూ, ఒలివ్‌ గ్రీన్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

మోటోరోలా G85 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు..
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI ను కలిగి ఉంది. మరియు క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 3 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. మరియు Adreno 619 GPU తోపాటు 12GB ర్యామ్, 256GB స్టోరేజీ తో జతచేసి ఉంటుంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని మోటోరోలా తెలిపింది.

ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ 3D కర్వడ్‌ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1080*2400 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 1600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్, 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌తో అందుబాటులో ఉంది. డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 5 తో రక్షణ పొందుతుంది.

కెమెరా విభాగంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలు సహా LED ప్లాష్‌ లైట్‌ను కలిగి ఉంది. 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను అమర్చి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. IP52 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రిసిస్టెంట్‌గా ఉంది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్‌ కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. భద్రత కోసం ఫేస్‌ అన్‌లాక్‌తోపాటు ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా మోటోరోలా G85 ఫోన్ 5G, 4G LTE, Wi-Fi 802, బ్లూటూత్‌ 5.1, GPS, A-GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు ప్రాక్సిమిటీ, గైరోస్కోప్‌, యాక్సెలిరోమీటర్‌, ఇ-కంపాస్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola G85 5G smartphone available at Rs16999 price in flipkart check specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X