50MP సోనీ కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.67 అంగుళాల FHD+ డిస్‌ప్లే 5G ఫోన్‌పై డిస్కౌంట్..!!
మోటోరోలా నుంచి ఈ సంవత్సరం జులై నెలలో మోటోరోలా G85 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 5000mAh బ్యాటరీ మరియు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ప్రస్తుతం మోటోరోలా G85 5G స్మార్ట్‌ఫోన్ (Motorola G85 5G Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ వేరియంట్ ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది.

యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డు, IDFC క్రెడిట్ కార్డు ద్వారా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. కోబాల్ట్ బ్లూ, ఒలివ్ గ్రీన్, అర్బన్ గ్రే, వివా మజెంటా రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
మోటోరోలా G85 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
మోటోరోలా G85 5G హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల FHD+ (1080*2400 పిక్సల్స్) 3D కర్వడ్ pOLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంది.
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. Adreno 619 GPU మరియు 12GB ర్యామ్, 256GB UFS 2,2 తో జతచేసి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI పైన పనిచేస్తుంది. 2 ఆండ్రాయిడ్ OS, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది.
మోటోరోలా హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను అమర్చి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. వెనుక వైపు LED ప్లాష్ లైట్‌ను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అమర్చారు. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. IP52 రేటింగ్‌తో డస్ట్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా మోటోరోలా ఫోన్ 5G, 4G LTE, బ్లూటూత్ 5.1, WiFi 802, GPS, A-GPS, Galileo, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు గైరోస్కోప్, ప్రాక్సిమిటీ, యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్, ఈ-కంపాస్ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








