రూ.2000 డిస్కౌంట్.. 50MP సోనీ ప్రైమరీ, 32MP సెల్ఫీ కెమెరాలు, 3D కర్వడ్ డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీ ఫోన్..!
Motorola G96 5G Smartphone : మోటోరోలా సంస్థ ఈ సంవత్సరం బడ్జెట్ ధరలో అనేక మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో పవర్ పేరుతో వచ్చిన మోడల్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం జులైలో మోటోరోలా G96 5G స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ వేగాన్ లెదర్ ఫినిష్, 3D కర్వడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ చిప్, 50MP ప్రైమరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
గరిష్ఠంగా రూ.2 వేల డిస్కౌంట్ :
మోటో G96 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మోటోరోలా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.19,999 గా ఉంది. మోటో వెబ్‌సైట్లో 128GB వేరియంట్‌పై SBI, ICICI బ్యాంకు కార్డులపై రూ.1000, 256GB స్టోరేజీ వేరియంట్ పై రూ.2000 డిస్కౌంట్‌ను అందిస్తోంది.

6 నెలల వరకు నో కాస్ట్ EMI :
దీంతోపాటు SBI, ICICI బ్యాంకు కార్డుల EMI లావాదేవీలపై 6 నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.
3D కర్వడ్ డిస్‌ప్లే :
మోటో G96 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల FHD+ 3D కర్వడ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను పొందుతోంది. ఈ ఫోన్ వెనుక వైపు వేగాన్ లెదర్ ఫినిష్ ను కలిగి ఉంది.

స్నాప్‌డ్రాగన్ చిప్ :
ఈ మోటో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్ 8GB LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ అనేక AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఫీచర్లను కలిగి ఉంది.
50MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా :
ఈ ఫోన్ వెనుక వైపు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) 50MP సోనీ LYT 700C కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఉంది. ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ 33W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
కలర్ వేరియంట్స్ :
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.2, Wi-Fi, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అమర్చారు. ఈ ఫోన్ కాట్లేయా ఆర్చిడ్, గ్రీనర్ పాశ్చర్స్, ఆష్లీ బ్లూ, డ్రెస్టెన్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








