మేము కూడా టచ్ స్క్రీన్ మొబైల్స్ విడుదల చేస్తున్నామోచ్...!

Posted By: Super

మేము కూడా టచ్ స్క్రీన్ మొబైల్స్ విడుదల చేస్తున్నామోచ్...!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్స్‌ని అనేక కంపెనీలు ఒకదానికొకటి పోటీ పడి మరి విడుదల చేస్తున్నాయి. అందుకు కారణం స్మార్ట్ పోన్స్ బిజినెస్ రంగంలో ఉన్న కాంపిటేషన్ అలాంటిది. మారుతున్న ప్రపంచంలో మనుషుల తీరుతెన్నులు, స్టయిల్స్ అన్ని కూడా మారుతున్నాయి. దేశీయ మొబైల్ దిగ్గజం మోటరోలా కొత్తగా రెండు కొత్త మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ రెండు మోడల్స్‌లలో ఒకటి మోటరోలా ఎక్స్ టి 531, రెండవది మోటరోలా ఎమ్ టి 870.

మోటరోలా ఎక్స్ టి 531, మోటరోలా ఎమ్ టి 870 రెండు మొబైల్స్ కూడా టచ్ స్క్రీన్ ఆధారిత ఫోన్స్. రెండు మొబైల్స్ లలో ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతాయి. యూజర్స్‌కు చక్కని ప్రెండ్లీ వాతావరణాన్ని అందిస్తాయి. ఐతే రెండు మొబైలలో ఉన్న తేడాలు ఏంటంటే మోటరోలా ఎక్స్ టి 531 డిస్ ప్లే సైజు మాత్రం కేవలం 3.5 ఇంచ్ ఉండగా, మోటరోలా ఎమ్ టి 870లో మాత్రం 4 ఇంచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగ ఉంది. స్క్రీన్ సైజు పెద్దదిగా ఉంటే యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ అందిస్తుంది.

మల్టీమీడియా, ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా యూజర్స్‌ని నిరాశకు గురిచేయవు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫీచర్స్‌ని కూడా సపోర్ట్ చే్స్తాయి. హై డెఫినేషన్ వీడియో ఫార్మెట్లు అయిన h263, h264లను కూడా సపోర్ట్ చేస్తాయి. మోటరోలా ఎక్స్ టి 531లో ఎప్ ఎమ్ రేడియో ఉండగా అదే మోటరోలా ఎమ్ టి 870లో ఎప్ ఎమ్ రేడియో ఫీచర్ లేదు. బయట స్పీకర్స్‌కి మొబైల్స్‌ని కనెక్ట్ చేసుకునేందుకుగాను 3.5mm యూనివర్సిల్ ఆడియో జాక్ ప్రత్యేకం.

మోటరోలా ఎమ్ టి 870లో కెమెరా 8 మెగా ఫిక్సల్ కెమెరా ఉండడం వల్ల హై డెఫినేషన్ వీడియో రికార్డింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. అదే మోటరోలా ఎక్స్‌టి 531లో 5మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది. రెండు మొబైల్స్ కూడా 3జి నెట్ వర్క్స్‌కి వీడియో కాలింగ్ ఫీచర్‌ని సపోర్ట్ చేయడం కోసం మొబైల్స్ ముందు భాగాన విజిఎ కెమెరాని కలిగి ఉన్నాయి.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలైన బ్లూటూత్, వై-పైలను సపోర్ట్ చేస్తాయి. 2జి ఇంటర్నెట్ టెక్నాలజీలైన GPRS, EDGEలను కూడా సపోర్ట్ చేస్తాయి. రెండు మొబైల్స్‌లలో కూడా మొబైల్‌తో పాటు ఇంటర్నల్ మొమొరీ రాగా మొమొరీని మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 16జిబి వరకు ఎక్పాండ్ చేసుకునే వెసులుబాటు ఉంది. మోటరోలా త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్న ఈ రెండు మొబైల్స్ ధరలు మాత్రం ఇంకా వెల్లడించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot