ఆండ్రాయిడ్‌ను కాదనుకున్న బ్రాండ్ ఎవరు..?

By Super
|
Motorola i412


గ్యాడ్జెట్ రంగంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న ‘గుగూల్ ఆండ్రాయిడ్’కు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. యూజర్ ఫ్రెండ్లీ లక్షణాలు పుష్కలంగా ఉన్న ఈ వోఎస్‌లకు సర్వత్రా ఆదరణ లభిస్తోంది. విశిష్టమైన వ్యవస్థతో టెక్ ప్రపంచంలో ప్రత్యేక హోదాను దక్కించుకున్న ‘ఆండ్రాయిడ్’కు రానున్న కాలంలో ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నాయా..?, ఆండ్రాయిడ్‌ను కాదునుకున్న మోటరోలా కొత్త వోఎస్ పై కన్నేసింది. నాన్ - ఆండ్రాయిడ్ ( ఆండ్రాయిడ్ కాని) మిడిల్ రేంజ్ హ్యాండ్ సెట్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు మోటరోలా రంగం సిద్ధం చేసింది. నమ్మకమైన లక్షణాలతో పాటు అత్యుత్తమ కెమెరా వ్యవస్థను ఒదిగి ‘మోటరోలా i412’ మోడల్ లో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ ఫోన్ పనితీరు...........

ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ఆపరేటింగ్ సిస్టం అధే విధంగా ప్రాసెసర్, కెమెరా వ్యవస్థలకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు. ఫోన్ డిస్‌ప్లే 1.79 అంగుళాలు పరిమాణం కలిగి ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌ను

ఈ డివైజ్ సపోర్ట్ చేస్తుంది. ఉత్తమమైన ఆడియో, వీడియో ప్లేయర్ వ్యవస్థలను డివైజ్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. అత్యుత్తమ మన్నిక కలగిన ఈ మొబైల్‌ను, సమంజసమైన ధరకే త్వరలోనే విడుదల చేస్తామని మోటరోలా వర్గాలు ఒక ప్రకటనలో ఉటంకించాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X