ఆ జనాన్ని ఆకట్టుకునేందుకేనా..?

Posted By: Prashanth

ఆ జనాన్ని ఆకట్టుకునేందుకేనా..?

 

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటరోలా తన తాజా ఆవిష్కరణకు సంబంధించి వివరాలను వెల్లడించింది. ‘మోటరోలా i475w’ వేరియంట్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ ఫోన్‌ను కంపెనీ డిజైన్ చేసింది. నేటితరం ఆశించే అంశాలన్నింటిని ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. మొబైల్ ఫోన్లు దిగువ-ముగింపు సెగ్మెంట్‌లో మోటరోలా i475w ఇతర బ్రాండ్‌లకు గట్టిపోటీనిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ సామాన్య మధ్య తరగతి వినియోగదారులకు మరింత ఆకర్షిస్తుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వక్తం చేస్తున్నాయి.

ఫోన్ కీలక ఫీచర్లు:

- 2 అంగుళాల స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 176 x 220పిక్సల్స్,

- ఉత్తమ ఇమేజ్ క్వాలిటీనందించే వీజీఏ కెమెరా,

- హై క్వాలిటీ ఆడియో మరియు వీడియో ప్లేయర్,

- ఎఫ్ఎమ్ రేడియో,

- బ్లూటూత్ మరియు యూఎస్బీ కనెక్టువిటీ,

- 100గంటల స్టాండ్ బై నిచ్చే లితియమ్ ఐయాన్ బ్యాటరీ,

- ఫోన్ బరువు 100 గ్రాములు,

- సులువైన టైపింగ్‌కు దోహదపడే క్వర్టీ కీప్యాడ్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot