Home
Mobile

పేరు చెప్పకుండానే టీజర్‌ విడుదల చేసిన మోటోరోలా.. ట్రిపుల్‌ కెమెరాలు, Neon కలర్‌ వేరియంట్‌!

Motorola India : మోటోరోలా నుంచి ఇటీవలే మోటో G96 5G స్మార్ట్‌ ఫోన్‌ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ రూ.17999 ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. అయితే మోటోరోలా నుంచి భారత్ మార్కెట్‌ లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ ను మోటోరోలా ఇటీవల విడుదల చేసింది.

ఈ రెండు ఫోన్‌లో ఏదో ఒకటి! :
మోటోరోలా ఇండియా X హ్యాండిల్‌ ద్వారా ఈ టీజర్‌ ను విడుదల చేసింది. అయితే ఈ ఫోన్‌ కు సంబంధించిన పేరు సహా ఇతర వివరాలను వెల్లడించలేదు. ఈ ఫోన్‌ మోటో G86 5G లేదా మోటో G56 5G గా భావిస్తున్నారు. అయితే మోటో మాత్రం అధికారికంగా వివరాలు వెల్లడించలేదు.

Motorola india teases new smartphone

ట్రిపుల్‌ కెమెరాలు :
మోటోరోలా ఇండియా తాజా టీజర్‌ ఆధారంగా త్వరలో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు LED ఫ్లాష్‌ లైట్‌ ను కూడా కలిగి ఉంటుంది. కుడి వైపున పవర్‌, వాల్యూమ్‌ బటన్స్‌ ను గుర్తించవచ్చు. ఈ ఫోన్ నియోన్‌ కలర్‌ వేరియంట్‌లో విడుదల కానుంది. ఈ కొత్త ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

మోటో G96 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఇటీవల భారత్‌ మార్కెట్‌ లో అందుబాటులోకి వచ్చిన మోటో G96 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.19999 గా ఉంది. ఈ ఫోన్‌ గ్రీనర్‌ పాశ్చర్స్‌, కాట్లేయా ఆర్చిడ్‌, ఆష్లీ బ్లూ, డ్రెస్టెన్ బ్లూ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుది.

ఈ ఫోన్‌ 144Hz రీప్రెష్‌ రేట్‌ తో 6.67 అంగుళాల FHD+ 3D కర్వడ్‌ pOLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది.

ఈ మోటో ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI Skin పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 700c ప్రైమరీ కెమెరా (OIS), 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాల ద్వారా 4K వీడియో రికార్డింగ్‌ చేయవచ్చు.

ఈ ఫోన్ 33W టర్బోపవర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, WiFi, బ్లూటూత్‌ 5.2, NFC, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola india teases new smartphone with triple camera could be G86 or G56 here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X