మొబైల్ దిగ్గజం మోటరోలా తన ప్రీమియమ్ ఫ్లాగ్‌షిప్ జెడ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం మూడు సరికొత్త మోటో మోడ్స్ (Moto Mods)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జేబీఎల్ సౌండ్ బూస్ట్ 2 స్పీకర్, మోటో టర్బో పవర్ ప్యాక్ బ్యాటరీ, గేమ్‌ప్యాడ్ మోడ్ మోడల్స్‌లో ఇవి లభ్యమవుతాయి.ఈ మోడ్స్ ద్వారా మోటో జెడ్, మోటో జెడ్ ప్లే, మోటో జెడ్2 ప్లే స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ డివైస్‌లను గేమింగ్ కన్సోల్ లేదా ప్రీమియమ్ జేబీఎల్ సౌండ్ బార్ ఇంకా టర్బో ఛార్జర్‌లా మార్చుకునే వీలుంటుంది.
మోటో మోడ్స్ వినియోగాన్ని తన కస్టమర్‌లకు మరింత చేరువచేసే క్రమంలో మోటరోలా, మరో సంస్థ అయిన రెంటోమోజోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రెంటోమోజో సంస్థ మోటో మోడ్స్‌ను రెంటల్ బేస్ క్రింద ఎంపిక చేసుకునే వీలుంటుంది. రూ.399 చెల్లించి వారం పాటు వీటిని అద్దెకు తీసుకునే వీలుంటుంది. డిసెంబర్ 23 నుంచి ఈ సర్వీస్ ప్రారంభమవుతంది. దేశవ్యాప్తంగా ఉన్న 8 ప్రధాన మెట్రో నగరాల్లో ఈ రెంటల్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
మోటో గేమ్ ప్యాడ్ మోడ్ (Moto Game Pad Mod)
ఈ మోడ్ ద్వారా యూజర్లు తమ మొబైల్ గేమింగ్ పై పూర్తి పట్ట సాధించే అవకాశం ఉంటుంది. ఈ మోడ్ స్మార్ట్‌ఫోన్‌ను కాస్తా హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ కన్సోల్‌లా మార్చేస్తుంది. ఈ మోడ్‌లో డ్యుయల్ కంట్రోల్ స్టిక్స్, డీ-ప్యాడ్ ఇంకా నాలుగు యాక్షన్ బటన్లు నిజమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తాయి. 1035mAh ఇన్-బిల్ట్ బ్యాటరీతో వస్తోన్న మోటో గేమ్ ప్యాడ్ మోడ్ ధర రూ.6,999. ఈ మోడ్ అన్ని మోటో హబ్‌లతో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్ 17 నుంచి సేల్ అవుతోంది.
మోటో జేబీఎల్ సౌండ్‌బూస్ట్2 (Moto JBL SoundBoost2)
ఈ మోడ్ ద్వారా హైక్వాలిటీ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లు పొందవచ్చు. 10 గంటల ప్లే టైమ్‌ను జేబీఎల్ సౌండ్‌బూస్ట్2 అందిస్తుంది. వాటర్ రిపెల్లెంట్ కోటింగ్‌తో వస్తోన్న ఈ డివైస్ రెడ్, బ్లూ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. బిల్ట్-ఇన్ కిక్ స్టాండ్‌తో వస్తోన్న జేబీఎల్ సౌండ్‌బూస్ట్2 ధర రూ.6999. ఈ మోడ్ అన్ని మోటో హబ్‌లతో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్ 17 నుంచి సేల్ అవుతోంది.
ఫేస్‌బుక్ ప్రకటనలలో వాట్సాప్ మెసేజింగ్ బటన్
మోటో టర్బోపవర్ ప్యాక్ మోడ్ (Moto TurboPower Pack Mod)
ఈ మోడ్ మోటో జెడ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు ఎక్స్‌ట్రా బ్యాటరీ లైఫ్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ మోడ్ ద్వారా 50 శాతం ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్‌ను కేవలం 20 నిమిషాల్లో పొందే వీలుంటుంది. 15 వాట్ వేగంతో ఫోన్‌ను ఛార్జ్ చేయగలుగుతుంది. మార్కెట్లో మోటో టర్బోపవర్ ప్యాక్ మోడ్ ధర రూ.7,999. ఈ మోడ్ అన్ని మోటో హబ్‌లతో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో రకాల మోడ్స్ డిసెంబర్ 17 నుంచి సేల్ అవుతోంది.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.