సూప్ లేకుండా అన్నం తినడం అంటే మోటరోలా క్రోన్సే

By Super
|
Motorola Kronos
ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో మోటరోలా హాంగామా ఇంతా కాదు. కొత్త కొత్త మోడళ్లతో హాల్ చల్ సృష్టిస్తుంది. మోటరోలా నుండి మరో క్రొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి దిగనుంది. ఇంతకీ ఏంటా ఆ స్మార్ట్ ఫోన్ అని అనుకుంటున్నారా.. మోటరోలా క్రోన్స్. ఇది పూర్తిగా హై ఎండ్ ఫోన్. విడుదలకు సిద్దంగా ఉన్నటువంటి ఈ మోడల్ స్పెషల్ ఏంటంటే అనుగుణంగా ఉండేటటువంటి ఆపరేటింగ్ సిస్టమ్, హై క్లారిటీ డిప్లే ఫీచర్, ఈజీగా అర్దమయ్యే రీతిలో ఉన్నవస్తువులు ఈ మోడల్ సొంతం.

మోటరోలా క్రోన్స్ ఆండ్రాయిడ్ 1.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన అవుతుంది. కేవలం ఒక్క టచ్ తోనే గూగుల్ ఉండేటటువంటి అన్ని రకాలైన అప్లికేషన్స్ డౌన్ లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఇందులో కల్పించడం జరిగింది. ఇక స్క్రీన్ సైజు విషయానికి 3.7 ఇంచ్ కలిగి ఉండి చూడడానికి ఎంతో అందంగా ఉంది. ఇక ఇందులో ఉన్న టచ్ స్క్రీన్, టచ్ ప్యాడ్ ఇందులో ఉన్న అన్ని అప్లికేషన్స్‌కి చేరువయ్యేందుకు ఒక్కసారి టచ్ చేస్తే చాలు.

 

ఇంటర్నెట్ వాడే విషయంలో మెయిలింగ్, మెసేజింగ్ చేయడం కోసం ప్రత్యేకంగా ఇందులో క్వర్టీ కీప్యాడ్ ఉంది. ఇక ప్రపంచం మొత్తాన్ని కనక్ట్ అయ్యేందుకు వై-పై కనెక్షన్ ఫెసిలిటీ కూడా ఇందులో పోందుపరచడం జరిగింది. వై-పై సర్టిఫికేషన్ పాస్ అయినటువంటి కొన్నిమొబైల్ ఫోన్స్‌లలో మోటరోలా క్రోన్స్ ఒకటి. సాధారణంగా మనం మాట్లాడుకునేటటువంటి మల్టీమీడియా ఫీచర్స్ ఇందులో ఉన్నప్పటికీ, ఎంటర్టైన్మెంట్ గేమ్స్ కోసం ఇది ప్రత్యేకంగా రూపోందించబడింది. ఇందులో 1Gz స్పీడ్ ప్రాసెసర్ అమర్చడం జరిగింది.

 

ఇందులో ఉన్న ఉపయోగాలు గురించి మాట్లాడుకుంటే క్లారిటీ వాయిస్, క్లారిటీ డిప్లే, సౌండ్ క్వాలిటీ మంచి ఎక్స్ పీరియన్స్‌ని అందిస్తాయి. అదేవిధంగా ఇందులో ఉన్న ఇబ్బందులను చూస్తే బ్యాటరీ, మొమొరీని విస్తరించుకునే సౌకర్యం లేకపోవడం, MP3 మ్యూజిక్ ప్లేయర్ లాంటివి లేకపోవడం. దీని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సూప్, వాటర్ లేకుండా కమ్మని అన్నం తినడం అన్నమాట.

Motorola Kronos features:

Android 2.2.1 Operating System
Stereo loud speakers and a 3.5mm standard audio output.
Full touch screen and full qwerty key pad
WIFI
Micro SD expandable memory
Bluetooth 2.1 + EDR
USB 2.0
5MP camera

ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ధరను ఇంకా నిర్ణయింలేదు. మిగిలిన సమాచారం కోసం వన్ ఇండియా మొబైల్‌ని ఫాలో అవ్వండి..

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X