మోటరోలాకు 'ల్యాప్‌డాక్' ఉండగా చింత ఏలా...

Posted By: Staff

మోటరోలాకు 'ల్యాప్‌డాక్' ఉండగా చింత ఏలా...

 

మోటరోలా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్స్‌ని వాడుతున్న యూజర్స్‌కు శుభవార్త. అందుకు కారణం మార్కెట్లోకి మరో కొత్త మోటరోలా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ 'మోటరోలా ల్యాప్‌ప్డాక్ 100' ని విడుదల చేసేందుకు మోటరోలా సన్నాహాలు చేస్తుంది. ఎవరైతే మోటరోలా స్మార్ట్ ఫోన్స్‌ని వాడుతున్నారో అటువంటి వారికి టాప్ వెబ్ బ్రౌజింగ్ సర్వీస్‌ని అందించేందుకు 'మోటరోలా ల్యాప్‌ప్డాక్ 100' ని విడుదల చేయడం జరుగుతుందని మోటరోలా ప్రతినిధులు తెలిపారు.

గతంలో మోటరోలా విడుదల చేసిన ఆట్రిక్స్ 2, ఫోటాన్ 4జీ, డ్రాయిడ్ బయోనిక్, డ్రాయిడ్ రేజర్ లాంటి స్మార్ట్‌ఫోన్స్‌తో పొల్చి చూస్తే 'మోటరోలా ల్యాప్‌ప్డాక్ 100' ని మెరుగైన సేవలను అందించనుందని సమాచారం. 'మోటరోలా ల్యాప్‌ప్డాక్ 100' మొబైల్ డిస్ ప్లే సైజు 10.1 ఇంచ్‌లతో పాటు, 1366 x 768 ఫిక్సల్ సుపీరియర్ రిజల్యూషన్‌ దీని సొంతం. మొబైల్ బరువు(2.2 lbs) కూడా చాలా తక్కువగా ఉండేందుకు గాను, మొబైల్ బాడీని ప్లాస్టిక్‌తో రూపొందించడం జరిగింది.

నాణ్యమైన కనెక్టివిటీని

సొంతం చేసుకునేందుకు గాను ఇందులో రెండు యుఎస్‌బి పోర్టులను నిక్షిప్తం చేయడం జరిగింది. క్వాలిటీ సౌండ్ ఎఫెక్టులను అందించేందుకు గాను మొబైల్ కుడి, ఎడమై వైపున రెండు స్పీకర్లను అమర్చడం జరిగింది. మొబైల్‌ని యూజర్స్ కొనుగోలు చేసిన తర్వాత మొబైల్‌తో పాటు లాక్ పోర్ట్, కనెక్షన్ ఎడాప్టర్‌ని రెండింటిని పొందుతారు. మంచి నావిగేషన్ కంట్రోల్‌ని అందించేందుకు గాను మొబైల్‌తో పాటు ట్రాక్‌ప్యాడ్ ఉచితం. మొబైల్‌లో నిక్షిప్తమైన క్వర్టీ కీస్‌తో యూజర్స్ సౌండ్‌ని పెంచడం, తగ్గించడం, ఆపివేయడం లాంటి వాటిని కూడా చేయవచ్చు.

మొబైల్‌తో పాటు ఫ్రీ ఇనిస్టాల్ ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్‌ని యూజర్స్ పొందుతారు. లాక్ ప్యాడ్ ద్వారా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్స్‌కి కనెక్ట్ అయినప్పుడు ఆటోమ్యాటిక్‌గా యూజర్స్ ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ని ఎడమవైపున ల్యాప్ డాక్ స్క్రీన్‌గా పొందడం జరుగుతుంది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో మోటరోలా ల్యాప్ డాక్ 100 మొబైల్ ధర సుమారుగా రూ 13,500గా ఉంటుందని మొబైల్ నిపుణులు అంచనా...

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot