ఇదిగోండి ‘మోటో 360’ స్మార్ట్‌వాచ్

మోటరోలా ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన స్మార్ట్‌వాచ్ మోటో 360 మరి కొద్ది రోజుల్లో ఇండియన్ మార్కెట్లో లభ్యంకాబోతోంది. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌వాచ్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించే అవకాశముంది. గురువారం కొత్తఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా కార్యక్రమంలో మోటరోలా కొత్త వర్షన్ మోటో జీ, మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మోటో 360 స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో మోటో 360 స్మార్ట్‌వాచ్ ధరకు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించలేదు. యూఎస్ మార్కెట్లో ఈ స్మార్ట్‌వాచ్ ధర 249 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.15,000).

మోటో 360 స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు...
గూగుల్ ఆండ్రాయిడ్ వేర్ ప్లాట్‌ఫామ్ పై మోటో 360 స్మార్ట్‌వాచ్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 4.3 ఆపై వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. 1.56 అంగుళాల బ్యాక్‌లైట్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320x290పిక్సల్స్, 205 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, టీఐ ఓఎమ్ఏపీ 3 ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 512 ఎంబి ర్యామ్, బ్లూటూత్ 4.0 కనెక్టువిటీ, 320 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఈ స్మార్ట్‌వాచ్ బరువు 49 గ్రాములు. ఒకే ఒక ఫిజికల్ బటన్‌ను ఈ వాచ్‌లో అమర్చటం జరిగింది. డ్యూయల్ మైక్రోఫోన్ వ్యవస్థ ఉత్తమ క్వాలిటీ ఆడియోను అందిస్తుంది. ఈ వాచ్ ఉన్న ప్రదేశాన్ని బట్టి వాతావరణం, సమయం, రిమైండర్స్, ట్రాఫిక్ తదితర అంశాలకు సంబంధించి అప్‌డేట్‌లను అందిస్తుంది. పటిష్టమైన వాటర్ ప్రూఫ్ వ్యవస్థతో డిజైన్ కాబడిన మోటో 360 స్మార్ట్‌వాచ్‌ను బ్లూటూత్ కనెక్టువిటీ సాయంతో స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించుకోవల్సి ఉంటుంది. కాల్స్, మెయిల్స్ తదితర లావాదేవీలను ఈ వాచ్ ద్వారానే నిర్వహించుకోవచ్చు. పిడోమీటర్, ఆప్టికల్ హార్ట్ రేట్ మానిటర్ వంటి సెన్సార్‌లను కలిగి ఉన్న మోటో 360 స్మార్ట్‌వాచ్ మార్కెట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications