మోటరోలా సరికొత్త ఫోన్ ‘మోటో జీ’

|

ప్రముఖ బ్రాండ్ మోటరోలా ‘మోటో జీ' పేరుతో సరికొత్త హ్యాండ్‌సెట్‌ను బ్రెజిల్ మార్కెట్లో ఆవిష్కరించింది. యూఎస్ మార్కెట్లో ఈ ఫోన్ ధర 179 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.11,300). మోటో జీ హ్యాండ్‌సెట్‌ను ఇండియన్ మార్కెట్లో జనవరి 2014 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్ జనవరి నాటికి ఆండ్రాయిడ్ కిట్‌కాట్ అప్‌డేట్‌ను అందుకోనుంది.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 4.5 అంగుళాల డిస్‌ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్, 329 పీపీఐ), స్నాప్‌డ్రాగెన్ 400 ఎస్ఓసీ విత్ 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 720 పిక్సల్ వీడియో రికార్డింగ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ ధర (రూ.11,300), 16 జీబి ఇంటర్నల్ మెమెరీ ధర (రూ.12500).

4జీ, ఎల్టీఈ కనెక్టువిటీ ఫీచర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వై-ఫై ఫీచర్‌ను పొందుపరిచారు. 7 కలర్ చేంజబుల్ బ్యాక్ కవర్స్, వాటర్ రిపెల్లంట్ కోటింగ్.

మోటో జీ ఫోన్‌ను బ్రెజిల్‌లో ఈ రోజు విడుదల చేసారు. యూకే ఇంకా కెనడా మార్కెట్లలో రాబోయే వారాల్లో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. యూఎస్ ఇంకా ఇండియా మార్కెట్లలో ఈ ఫోన్ జనవరి 2014 నుంచి లభ్యమవుతుంది. ఫోన్‌లోని 10 ప్రత్యేకతలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

శక్తివంతమైన బేసిక్ ఫీచర్లు:

శక్తివంతమైన బేసిక్ ఫీచర్లు:

శక్తివంతమైన బేసిక్ ఫీచర్లు:

మోటో జీ రూపకల్పనలో భాగంగా కంపెనీ సాఫ్ట్‌వేర్ బృందం అత్యధిక సమయాన్ని సాఫ్ట్‌వేర్ బేసిక్ ఫీచర్లను శక్తివంతంగా తీర్చిదిద్దేందుకే కేటాయించింది.
మోటో జీ గెలాక్సీ ఎస్4తో పోలిస్తే వేగవంతంగా బూట్ కాగలదని మోటరోలా సాఫ్ట్‌వేర్ బృందం

అంటోంది.

 

మోటరోలా మైగ్రేట్:

మోటరోలా మైగ్రేట్:

మోటరోలా మైగ్రేట్:

మోటో జీ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన సరికొత్త ‘మైగ్రేట్ అప్లికేషన్' మీ పాత ఫోన్‌లోని ముఖ్యమైన డేటాను కొత్త ఫోన్‌లోకి వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసేందుకు దోహదపడుతుంది.

 

శక్తివంతమైన ఇమేజింగ్ అప్లికేషన్

శక్తివంతమైన ఇమేజింగ్ అప్లికేషన్

శక్తివంతమైన ఇమేజింగ్ అప్లికేషన్

మోటరోలా తమ సరికొత్త మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన ఇమేజింగ్ అప్లికేషన్‌ను దోహదం చేసింది. ఈ కెమెరా అప్లికేషన్ ద్వారా మరింత సౌకర్యవంతమైన ఫోటోగ్రఫీని వినియోగదారుదు ఆశించవచ్చు.

అదనపు డ్రైవ్ స్టోరేజ్

అదనపు డ్రైవ్ స్టోరేజ్


అదనపు డ్రైవ్ స్టోరేజ్:

మోటో జీ వినియోగదారులు 50జీబి అదనపు స్టోరేజ్‌ను గూగుల్ డ్రైవ్ ద్వారా పొందవచ్చు.

 

ఎఫ్ఎమ్ అప్లికేషన్

ఎఫ్ఎమ్ అప్లికేషన్

ఎఫ్ఎమ్ అప్లికేషన్:

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసిన ఎఫ్ఎమ్ అప్లికేషన్ ద్వారా ఇష్టమైన లోకల్ రేడియో స్టేషన్‌లను ట్యూన్ చేసుకోవచ్చు.

 

డ్యూయల్ సిమ్

డ్యూయల్ సిమ్

డ్యూయల్ సిమ్:

మోటో జీ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ సౌకర్యంతో ఏకకాలంలో రెండు నెట్‌వర్క్‌లను ఉపయోగించుకోవచ్చు.

 

 మార్చుకోదగిన బ్యాక్ షెల్స్

మార్చుకోదగిన బ్యాక్ షెల్స్

మార్చుకోదగిన బ్యాక్ షెల్స్:

మోటో జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ ఫోన్ వెనుక భాగాన్ని 7 కలర్ వేరియంట్స్‌లో మార్చుకోవచ్చు.

 

ఉపకరణాలు

ఉపకరణాలు

ఉపకరణాలు:

మోటో‌ జీ స్మార్ట్‌ఫోన్‌ల కోసం సౌల్ కంపెనీ ఇయర్‌ఫోన్‌లను రూపొందించగా, జేబీఎల్ కంపెనీ పోర్ట్‌బుల్ స్పీకర్లను డిజైన్ చేసింది.

 

అసిస్టెంట్ అప్లికేషన్

అసిస్టెంట్ అప్లికేషన్

అసిస్టెంట్ అప్లికేషన్:

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసిన నిఫ్టి అసిస్ట్ అప్లికేషన్ మీరు డ్రైవింగ్ చేస్తున్న సమయాల్లో సందేశాలకు ఆటోమెటిక్‌గా బదులు ఇచ్చేస్తుంది. అంతేకాదు, మీటింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ను సైలన్స్ మోడ్‌లో ఉంచటం వంటి పనులు కూడా చేసేస్తుంది.

 

వాటర్ రిపెల్లంట్ కోటింగ్

వాటర్ రిపెల్లంట్ కోటింగ్

వాటర్ రిపెల్లంట్ కోటింగ్:

మోటో జీ స్మార్ట్‌ఫోన్ వాటర్ రిపెల్లెంట్ కోటింగ్‌ను కలిగి ఉంది. దింతో ఫోన్ చమ్మతాకిడికి గురైనప్పటికి చెక్కు చెదరదు.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X