మోటరోలా నుంచి సరికొత్త ‘మోటో జీ’

|

గురువారం కొత్తఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా కార్యక్రమంలో మోటరోలా కొత్త వర్షన్ మోటో జీ, మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మోటో 360 స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది. కొత్త వర్షన్ మోటీ జీ ధర రూ.12,999. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ నేటి అర్థరాత్రి నుంచి కొత్త వర్షన్ మోటో జీ ఫోన్‌లను విక్రయించనుంది. మోటో ఎక్స్ మరి కొద్ది రోజుల్లో మార్కెట్లో విడుదల చేస్తారు.

కొత్త వర్షన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.. వాటర్ రెసిస్టెంట్ నానో కోటింగ్, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1020పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, జీపీఎస్), 2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. రెండు స్టీరియో స్పీకర్లను ఫోన్ ముందు భాగంలో అమర్చారు. ఫోన్ బరువు 149 గ్రాములు, మందం 10.99 మిల్లీ మీటర్లు.

మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్

మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.. 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), కర్వుడ్ మెటల్ ఫ్రేమ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌‍క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్ 4.0, జీపీఎస్), 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 144 గ్రాములు, ఫోన్ మందం 9.9 మిల్లీ మీటర్లు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Motorola launches new Moto G at Rs 12,999, Moto X to arrive later this month. Read more in Telugu Gizbot......

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X