అవి కూడా బయటకు వస్తే..?

ప్రఖ్యాత మొబైల్ తయారీ బ్రాండ్ మోటరోలా 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేస్తుంది. పేరు మోటరోలా ఫూటాన్ క్యూ 4జీ ఎల్‌టీఈ. ఇంకా డవలెప్‌మెంట్ దశలోనే ఉన్న ఈ డివైజ్‌కు సంబంధించి ఇతర ఫీచర్లు తెలియాల్సి ఉంది. ఈ ఫోన్ డిజైనింగ్‌కు సంబంధించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫోన్ టైటిల్‌లో ఉన్న ‘క్యూ’ అక్షరాన్ని కొందరు క్వాడ్ కోర్‌గా అభివర్ణిస్తుంటే మరి కొందరు క్వర్టీ మోడల్‌గా అంచనా వేస్తున్నారు.
ఫోన్ కీలక ఫీచర్లు:
720 పిక్సల్ హై డెఫినిషన్ డిస్‌ప్లే,
ఎల్‌టీఈ రేడియోస్,
క్వాడ్‌కోర్ టెగ్రా 3 ప్రాసెసర్,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్చ
4జీ ఫీచర్లు,
సుదీర్ఘ బ్యాటరీ లైఫ్.
అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో రూపుదిద్దుకుంటున్న మోటరోలా క్యూ ఫూటాన్ 4జీ, ఎల్‌జీ అదేవిధంగా హెచ్‌టీసీలకు ప్రధాన పోటీదారు కానుంది. ఈ ఫోన్ ఇతర ఫీచర్ల విడదలకు సంబంధించి మోటోరోలా అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
మోటరోలా Xoom1 టాబ్లెట్ పీసీ ఫీచర్లు:
ఆండ్రాయిడ్ 3.1 ఆపరేటింగ్ సిస్టమ్, 1000 MHz డ్యూయల్ కోర్ న్విడియా టెగ్రా 2 ప్రాసెసర్, 32జీబీ మైక్రో ఎస్డీ స్లాట్, 1జీబీ ర్యామ్, 10.1 అంగుళాల డిస్ ప్లే, మల్టీ టచ్ స్క్రీన్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ డిజిటల్ కెమెరా, 720p హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, 802.11 b/g/n వై-ఫై కనెక్టువిటీ, జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్, 3.5 ఆడియో జాక్, ఆధునిక వర్షన్ యూఎస్బీ పోర్ట్ర్స్, లితియమ్ ఐయాన్ బ్యాటరీ (10 గంటల బ్యాకప్) ఇతర అత్యాధునిక మల్టీ మీడియా ఫీచర్లను నిక్షిప్తం చేశారు.


Click it and Unblock the Notifications