మార్కెట్లోకి మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు

Posted By: Staff

మార్కెట్లోకి మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు

 

ముంబై: ప్రముఖ సెల్‌ఫోన్‌ల నిర్మాణ సంస్థ మోటరోలా తన డెఫీ సిరీస్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రతికూల వాతావరణాలను సైతం ధీటుగా ఎదుర్కొగల వాటర్ రెసిస్టెంట్, స్ర్కాచ్ రెసిస్టెంట్ ఇంకా డస్ట్ ప్రూఫ్ పొరలను ఈ ఫోన్‌లు కలిగి ఉన్నాయి. ‘డెఫీ ఎక్స్‌టీ’, ‘డెఫీ మినీ’ మోడళ్లలో డిజైన్ కాబడిన ఈ హ్యాండ్‌సెట్‌లు ఫీచర్ మోటోస్విచ్, హ్యాండీ యూజర్ ఇంటర్‌ఫేస్ వంటి అత్యాధునిక మొబైలింగ్ వ్యవస్థలను కలిగి ఉన్నాయి. మోటోరోలో డెఫీ ఎక్స్‌టీ ఎంపిక చెయ్యబడ్డ రిటైస్ స్టోర్‌లలో రూ.16,190 ధరకు లభ్యమవుతుంది. జూన్ 20 నుంచి అందుబాటులోకి రానున్న మోటరోలా డెఫీ మినీ ధరను రూ. 11,490గా నిర్థారించారు.

మోటరోలా డెఫీ మినీ ఫీచర్లు:

* టీఎఫ్టీ గొరిల్లా గ్లాస్ సామర్ధ్యం గల 3.2 అంగుళాల డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ 320 x 480 పిక్సల్స్) ,

* డ్యూయల్ సిమ్,

* 3.15 పిక్సల్ రేర్ కెమెరా రిసల్యూషన్ (2048 x 1536పిక్సల్స్),

* వీజీఏ ఫ్రంట్ కెమెరా,

* వీడియో రికార్డింగ్ సౌలభ్యత,

* అన్‌లిమిటెడ్ ఫోన్‌బుక్,

* అన్‌లిమిటెడ్ కాల్ రికార్డ్స్,

* ఇంటర్నల్ మెమెరీ 512 ఎంబీ,

* మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ (32జీబి ఎక్సటర్నల్ ),

* 512 ఎంబీ ర్యామ్,

* జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ.

* 2జీ (జీఎస్ఎమ్),3జీ (హెచ్ఎస్ డీపీఏ) నెట్‌వర్క్ సపోర్ట్,

* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో,

* బ్యాటరీ బ్యాకప్ 504 గంటలు, ఆండ్రాయిడ్ v2.3.6 ఆపరేటింగ్ సిస్టం,

* 600 MHz ప్రాసెసర్,

* ధర రూ.11,490.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot