మోటరోలా, లెనోవో కాంబినేషన్‌తో కొత్త ఫోన్.. త్వరలో

Posted By:

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇటీవల తన మోటరోలా మొబిలిటీ విభాగాన్ని చైనా స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లెనోవోకు విక్రయించిన విషయం తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ రెండు కంపెనీలు భాగస్వామ్యంతో త్వరలో ఓ ఫోన్త్వరలో విడుదల కాబోతోంది.

మోటరోలా, లెనోవో కాంబినేషన్‌తో కొత్త ఫోన్.. త్వరలో

మోటరోలా, లెనోవో భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న ఓ హ్యాండ్‌సెట్ అక్టోబర్ లేదా నవంబర్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని అనధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు లెనోవో తన సరికొత్త 4జీ ఫోన్‌ను జూన్ చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చు ప్రయత్నాలు చేస్తోంది. అనధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు లెనోవో, మోటరోలా కాంబినేషన్‌‍తో రూపుదిద్దుకుంటున్న స్మార్ట్‌ఫోన్‌కు ‘మోటో ఎక్స్+1'గా వచ్చే అవకాశముందని ఓ రూమర్.

కొద్ది రోజుల క్రిందట మోటరోలా మొబిలిటీ ‘మోటో ఎక్స్'(Moto X ) పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాండ్‌సెట్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా వాల్నట్ ఫినిష్ (Walnut Finish) డిజైన్‌తో కూడిన సరికొత్త మోటో ఎక్స్ వేరియంట్‌ను మోటరోలా దేశీయ మార్కెట్ కు పరిచయం చేసింది. ధర 25,999. ప్రముఖ ఇ-కామర్స్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను ప్రత్యేకంగా ఆఫర్ చేస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot