మోటరోలా నుంచి కత్తిలాంటి ఫోన్ రాబోతోంది..?

ఆధునిక ఫీచర్లతో కూడిన క్వాలిటీ స్మార్ట్ మొబైలింగ్ కోరుకునే వారికోసం మోటారోలా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. అదే మోటరోలా Moto Z Play. మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్‌ తరహాలోనే ఈ ఫోన్‌కు Moto Mods పేరుతో పలు రకాల మాడ్యులర్ యాక్సెసరీస్‌ను మోటరోలా అందిస్తోంది. వీటితో Moto Z Play స్మార్ట్‌ఫోన్‌ను కావల్సిన విధంగా మార్చుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన మాడ్యులర్ కేసెస్‌తో ఫోన్‌ను ఇన్‌స్టెంట్ పవర్ బ్యాంక్‌లా, సౌండ్ బూస్టర్‌లా, ప్రొజెక్టర్‌లా, అధిక ఫ్లాషెస్‌తో కూడిన కెమెరా లెన్స్‌లా మార్చేసుకోవచ్చు.

 మోటరోలా నుంచి కత్తిలాంటి ఫోన్ రాబోతోంది..?

Read More : మీ ATM కార్డ్ గురించి షాకింగ్ నిజాలు!

Moto Z Play ఫోన్‌కు సంబంధించి ఇప్పటికే అనేక లీక్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ Weibo మోటో జెడ్ ప్లేకు సంబంధించి చైనా స్టోర్‌లో ఏర్పాటు చేసిన ఓ అడ్వర్టైజింగ్ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోను బట్టి త్వరలోనే ఈ ఫోన్ అక్కడి మార్కెట్లో లాంచ్ కాబోతోందని తెలుస్తోంది. మార్కెట్లో మరికొద్ది రోజుల్లో లాంచ్ కాబోతోన్న Moto Z Play స్పెసిఫికేషన్స్‌కు సంబంధించి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఆసక్తికర రూమర్స్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5.5 అంగుళాల 1080 పిక్సల్ అమోల్డ్ స్ర్కీన్

అందుతోన్న సమాచారం ప్రకారం మోటో జెడ్‌ప్లే 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో రాబోతోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1080 x 1920పిక్సల్స్, 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, డిస్‌ప్లేకు రక్షణ కవచంలా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 టెక్నాలజీ ఏర్పాటు.

 

శక్తివంతమైన ప్రాసెసర్

మోటరోలా తన Moto Z Play ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్‌ను ఎంబెడ్ చేసే అవకాశం. 2.0గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో కూడిన octa-core ప్రాసెసర్‌ను ఈ చిప్‌సెట్‌లో పొందుపరిచే అవకాశం, అడ్రినో 506 జీపీయూ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

 

రెండు ర్యామ్ వేరియంట్‌లలో

మోటరోలా తన Moto Z Play ఫోన్‌ను రెండు ర్యామ్ వేరింయట్‌లలో లాంచ్ చేసే అవకాశం. అందులో మొదటి వేరియంట్ 3జీబి, రెండవ వేరియంట్ 4జీ. మొదటి వేరియంట్ 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో లభ్యమయ్యే అవకాశం.

కెమెరా విషయానికొస్తే...

మోటరోలా తన Moto Z Play ఫోన్‌లో ఆధునిక ఫోటోగ్రఫీ ఫీచర్లతో కూడిన 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను పొందుపరిచే అవకాశం.

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్

మోటరోలా తన మోటో జెడ్, మోటో జెడ్ ఫోర్స్ ఫోన్‌లలో 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్‌కు బదులు యూఎస్బీ టైప్ సీ పోర్ట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ Moto Z Play ఫోన్‌లో యధావిధిగా 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్‌ను ఏర్పాటు చేసే అవకాశం.

 

బ్యాటరీ ఇంకా ఆపరేటింగ్ సిస్టం

TENAA listing ప్రకారం మోటో జెడ్‌ప్లే శక్తివంతమైన 3,300 ఎమ్ఏహెచ్ లేదా 3,510ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వచ్చే అవకాశం. Android 6.0.1 Marshmallow పై ఫోన్ రన్ అవుతుంది. త్వరలోనే Android N అప్‌డేట్ అభించే అవకాశం.

ధరలు

సెప్టంబర్ 6న అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ కాబోతోన్న ఈ ఫోన్ ధర.. వేరియంట్‌ను బట్టి రూ.27,000 నుంచి రూ.33,500 మధ్య ఉండొచ్చని అంచనా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Motorola Might Launch Moto Z Play on September 6: Here Are Top 7 Specifications Leaked Till Date. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot