క్యూ కడుతున్నారు..!!

By Prashanth
|
Motorola


ఏ ముహూర్తానా గుగూల్ ఆండ్రాయిడ్ వర్షన్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టంను ఆవిష్కరించారోగానీ... ఆదరణ మాత్రం అంబరాన్ని తాకుతుంది. స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు మొదలుకుని టాబ్లెట్ కంప్యూటర్ నిర్మాణ సంస్థల వరకు ఈ వోఎస్‌నే ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ కోవకే చెందిన మోటరోలా ఇండియాలో రిలీజ్ చేసిన పలు స్మార్ట్ ఫోన్‌లకు 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఏప్రిల్, జూన్ మధ్యలో ఈ నవీకరణలు ఉంటాయని మోటరోలా అధికార వర్గాలు ప్రకటించాయి. ఆసియా పెసిఫిక్ ప్రాంతాలకు సైతం ఈ అప్‌డేట్ వర్తిస్తుంది.

 

మొట్టమొదటిగా ఈ అప్‌డేట్ ‘Droid Razr XT910’ హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌కు వర్తిస్తుంది. వరసలో మరో హై‌ ఎండ్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఆట్రిక్స్ ఉంది. మోటరోలా రూపొందించిన మోటరోలా జూమ్, జూమ్ 2 టాబ్లెట్ పీసీలకు సైతం ఈ అప్‌డేట్ వర్తించనుంది. పూరిపూర్ణమైన మల్టీ టాస్కింగ్ లక్షణాలకు కలిగి ఉన్న ‘ఆండ్రాయిడ్ 4.0 వోఎస్’ పూర్తి స్థాయి యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X