మార్కెట్లోకి మోటరోలా స్మార్ట్‌వాచ్ ‘మోటో 360’

Posted By:

ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థ మోటరోలా, స్మార్ట్‌వాచ్‌ల విభాగంలో ఇటీవల ఆవిష్కరించిన 'మోటో 360' స్మార్ట్‌వాచ్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో అధికారికంగా లభ్యమవుతోంది. ధర రూ.17,999. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ (flipkart) ఈ స్మార్ట్‌వాచ్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

 మార్కెట్లోకి మోటరోలా స్మార్ట్‌వాచ్ ‘మోటో 360’

ఆండ్రాయిడ్ వేర్‌ప్లాట్ ఫామ్ పై స్పందించే ఈ స్మార్ట్‌వాచ్‌లో వాయిస్ కంట్రోల్ సౌకర్యంతో పాటు సమాచారాన్ని ఎస్ఎంఎస్‌లరూపంలో పంపుకునే అవకాశాన్ని కల్పించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మోటో 360 స్మార్ట్‌వాచ్‌ను ఇంచుమించుగా స్మార్ట్‌ఫోన్‌లా ఉపయోగించుకోవచ్చు..

మోటో 360 స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు...

గూగుల్ ఆండ్రాయిడ్ వేర్ ప్లాట్‌ఫామ్ పై మోటో 360 స్మార్ట్‌వాచ్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 4.3 ఆపై వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. 1.56 అంగుళాల బ్యాక్‌లైట్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320x290పిక్సల్స్, 205 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, టీఐ ఓఎమ్ఏపీ 3 ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 512 ఎంబి ర్యామ్, బ్లూటూత్ 4.0 కనెక్టువిటీ, 320 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఈ స్మార్ట్‌వాచ్ బరువు 49 గ్రాములు. ఒకే ఒక ఫిజికల్ బటన్‌ను ఈ వాచ్‌లో అమర్చటం జరిగింది. డ్యూయల్ మైక్రోఫోన్ వ్యవస్థ ఉత్తమ క్వాలిటీ ఆడియోను అందిస్తుంది. ఈ వాచ్ ఉన్న ప్రదేశాన్ని బట్టి వాతావరణం, సమయం, రిమైండర్స్, ట్రాఫిక్ తదితర అంశాలకు సంబంధించి అప్‌డేట్‌లను అందిస్తుంది. పటిష్టమైన వాటర్ ప్రూఫ్ వ్యవస్థతో డిజైన్ కాబడిన మోటో 360 స్మార్ట్‌వాచ్‌ను బ్లూటూత్ కనెక్టువిటీ సాయంతో స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించుకోవల్సి ఉంటుంది. కాల్స్, మెయిల్స్ తదితర లావాదేవీలను ఈ వాచ్ ద్వారానే నిర్వహించుకోవచ్చు. పిడోమీటర్, ఆప్టికల్ హార్ట్ రేట్ మానిటర్ వంటి సెన్సార్‌లను కలిగి ఉన్న మోటో 360 స్మార్ట్‌వాచ్ మార్కెట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Motorola Moto 360 Finally Launched in India for Rs17,999. Read more in Telugu Gizbot......
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot