రూ.6,490కే మోటరోలా ఫోన్, మీ బజార్‌లో కూడా దొరికేలా ప్లాన్స్..?

మోటరోలా తన అల్ట్రా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌‌లైన మోటో సీ, మోటో సీ ప్లస్‌లను కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ మార్కెట్లో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మార్కెట్లో ఈ ఫోన్‌ల ధరలు 100 డాలర్లు లోపు ఉండొచ్చని తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.6,490.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లీకైన రిటైల్ బాక్స్ ఫోటోలు..

తాజాగా ఈ ఫోన్‌లకు సంబంధించిన రిటైల్ బాక్స్ ఫోటోలను Techupdate3 అనే ఇండియన్ వెబ్‌సైట్ రివీల్ చేసింది.

ఆఫ్‌లైన్ మార్కెట్లో మాత్రమే దొరుకుతాయి...

ఈ సైట్ పోస్ట్ చేసిన కధనం ప్రకారం ఇండియలో Moto C అమ్మకాలు జూన్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ ఫోన్‌లు ఆన్‌లైన్ మార్కెట్లో కాకుండా ఆఫ్‌లైన్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

రూ.6,490కే విక్రయిస్తారు...

రూ.6,999 ధర ట్యాగ్‌తో వచ్చే ఈ ఫోన్‌లను ఆఫ్‌లైన్ దుకాణాల్లో రూ.6,490కే విక్రయిస్తారు.  Moto C రిలీజ్ డేట్ ఎప్పుడనేది మాత్రం సదురు సైట్ వెల్లడించలేదు.

మోటరోలా త్వరలోనే రివీల్ చేసే అవకాశం..

ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించి అఫీషియల్ అప్‌డేట్‌ను మోటరోలా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

Moto C స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్480x 854పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.1గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6737M చిప్ సెట్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

Moto C స్పెసిఫికేషన్స్..

5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్, 2350mAh బ్యాటరీ, ఫోన్ బరువు 154 గ్రాములు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Motorola Moto C Could be an Offline-Only Model Carrying a Price Tag of Rs.6,499 in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot