మోటో ఇ అమ్మకాలు మరో సారి ప్రారంభమయ్యాయి
మోటరోలా మోటో ఇ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను ఫ్లిప్‌కార్ట్ మరోసారి ప్రారంభించింది. ఈ లిమిటెడ్ స్టాక్ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంతో తెలియదు. కాబట్టి మోటో ఇ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహికులు వెంటనే ఫ్లిప్‌కార్ట్‌లోకి లాగినై తమ మోటో ఇ యానిట్‌ను సొంతం చేసుకోవాలని గిజ్ బాట్ సూచిస్తోంది. రూ.6,999 ధర ట్యాగ్‌ను కలిగి ఉన్న ఈ ఆధునిక వర్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తుండటంతో వీటికి భారీ డిమాండ్ నెలకుంది. విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మోటో ఇ అమ్మకాలకు పలుమార్లు స్టాక్ కొరత ఏర్పడింది.

ఇండియన్ మార్కెట్లో మోటో ఇ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లో లభ్యమవుతోంది. ధర రూ.6,999. మోటరోలా మోటో ఇ, 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉంటుంది.రిసల్యూషన్ సామర్ధ్యం 540x 960పిక్సల్స్, 256 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్ర్కీన్‌ను మోటరోలా ఈ డివైస్‌ను వినియోగించింది. పొందుపరిచిన ‘వాటర్ నానో కోటింగ్ 'నీటి ప్రమాదాల నుంచి డివైస్‌ను రక్షిస్తుంది. 1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ డివైస్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పొందుపరిచిన 1జీబి ర్యామ్ సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.
ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఫ్రంట్ కెమెరా లేదు. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని మోటరోలా కల్పిస్తోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications