దీపావళి డిస్కౌంట్: మోటరోలా ‘మోటో ఇ’ ఇప్పుడు రూ.6,299కే

Posted By:

దీపావళిని పురస్కరించుకుని మోటరోలా తన ‘మోటో ఇ' స్మార్ట్‌ఫోన్ పై రూ.700 ధర తగ్గింపును ప్రకటించింది. తాజా ధర తగ్గింపులో భాగంగా మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌ను రూ.6,299కి సొంతం చేసుకోవచ్చు. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ‘మోటో ఇ’ ఇప్పుడు రూ.6,299కే

మోటరోలా మోటో ఇ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

4.3 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 960x540పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.4.2 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (హెచ్ ఎస్ఏ+, బ్లూటూత్ 4.0, జీపీఎస్, వై-ఫై కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్), 1989 ఎమ్ఏమెచ్ బ్యాటరీ.

మోటరోలా మోటో ఇ పనితీరు

మోటరోలా మోటో ఇ క్లాసికల్ డిజైన్ తొలి లుక్‌లోనే మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ శరీర నిర్మాణంలో భాగంగా ప్లాస్టిక్ వంటి పదార్థాన్ని వినియోగించారు. డివైస్ మందం 12.3 మిల్లీమీటర్లు. ఈ పాకెట్ ఫ్రెండ్లీ ఫోన్ సరిగ్గా చేతిలో ఇమిడిపోతుంది. ఫోన్ పరిమాణం 124.8 x 64.8 x 12.3 మిల్లీమీటర్లు, బరువు 140 గ్రాములు.

ఫోన్‌లో అమర్చిన 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే నాణ్యమైన వీక్షణా అనుభూతులను చేరువ చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ హ్యాండ్ సెట్‌కు రక్షణ కవచంలా వ్యవహరిస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కోటింగ్ ఫోన్‌ను నీటి ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఇయర్‌పీస్ స్పీకర్, ప్రధాన స్పీకర్ అలానే ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు నమ్మకమైన పనితీరును ప్రదర్శిస్తాయి. మోటరోలా మోటో ఇ అత్యుత్తమ వాయిస్ కాలింగ్‌ను అందిస్తుందని అనటంలో ఏమాత్రం సందేహం లేదు.

మోటరోలా మోటో ఇ ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. భవిష్యత్‌లో ఈ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ను మరో వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫోన్‌లో నిక్షిప్తం చేసిన మోటో అసిస్ట్, మోటో మైగ్రేట్, మోటో అలర్ట్ వంటి ఫీచర్లు యూజర్‌కు మరింతగా దోహదపడతాయి. మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌లో ముందుగానే 5 హోమ్‌స్ర్కీన్‌లను లోడ్ చేసారు వాటిలో నచ్చిన హోమ్‌స్ర్కీన్‌‌ను ఉపయోగించుకోవచ్చు.

మోటరోలా మోటో ఇ 1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. నిక్షిప్తం చేసిన అడ్రినో 302 400 మెగాహెట్జ్ సింగిల్ కోర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది. 1జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది. 4జీబి ఇంటర్నల్ మెమరీ, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఫ్రంట్ కెమెరా లేదు.మోటో ఇ స్మార్ట్‌ఫోన్ బలోపేతమైన 1980ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంది. బ్యాటరీ పూర్తి చార్జ్ పై సూదూర టాక్ టైమ్‌ను యూజర్ పొందవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘మోటో ఇ' ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను యూజర్ ఆస్వాదించవచ్చు.

గిజ్‌బాట్ బృందం నిర్వహించిన అన్ని బెంచ్‌మార్క్ పరీక్షలను మోటో ఇ స్మార్ట్‌ఫోన్ సమర్థవంతంగా ఎదుర్కొంది. ఫోన్‌ను రోజంతా ఉపయోగించినప్పటికి ఫోన్ బ్యాక్ ప్యానల్ ఏమాత్రం వేడెక్కలేదు ఇది ఒక మంచి పరిణామంగా భావించవచ్చు.

మోటో ఇ అన్‌బాక్సింగ్ వీడియో

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/WcLsXKnTK5s?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Motorola Moto E Now Available At Rs 6,299 [Diwali Discount]. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot