మోటరోలా ‘మోటో ఇ’.. లోపించిన ఫీచర్లేంటి?

|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన మోటోరోలా మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్ ‘మోటో ఇ'దేశీయంగా గొప్ప క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ డివైస్ విక్రయాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ సొగసరి స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకంగా విక్రయిస్తోంది. 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెర, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్ర్కీన్‌, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌, అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ వంటి అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.6,999.

 

యువతను మెప్పించేనా..?

మోటో ఇ ఆవిష్కరణతో సామ్‌సంగ్, నోకియా, మైక్రోమాక్స్, కార్బన్ వంటి బ్రాండ్‌లకు మోటరోలా గట్టిపోటినిచ్చిందనే భావించవచ్చు. అయితే, మోటో జీ ఫోన్ యువతను ఏ మేరకు ఆకట్టుకోగలుగుతుందేని మార్కెట్ వర్గాల సందేహం. స్మార్ట్ మొబైలింగ్‌ను అమితంగా ఇష్డపడుతున్న నేటి జనరేషన్ తాము ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్‌లలో వీడియో కాలింగ్ మొదలుకుని హైడెఫినిషన్ వీడియోరికార్డింగ్ వరకు అన్ని సౌకర్యాలు ఉండాలని కోరుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణిలో విడుదలైన ‘మోటో ఇ'స్మార్ట్‌ఫోన్ యువతను ఏ మేరకు ఆకర్షిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుత ట్రెండ్‌తో విశ్లేషణ చేస్తూ మోటరోలామోటో ఇ స్మార్ట్‌ఫోన్‌లో లోపించిన పలు ముఖ్య ఫీచర్లను మీకు సూచిస్తున్నాం. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మోటరోలా ‘మోటో ఇ’.. లోపించిన ఫీచర్లేంటి?

మోటరోలా ‘మోటో ఇ’.. లోపించిన ఫీచర్లేంటి?

ఫ్రంట్ కెమెరా లోపించింది

మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్రంట్ కెమెరా ఫీచర్ లోపించింది. దీంతో.. వీడియో కాలింగ్ సాధ్యపడదు. సెల్ఫీలను కూడా చిత్రీకరించుకోలేం.

 

మోటరోలా ‘మోటో ఇ’.. లోపించిన ఫీచర్లేంటి?

మోటరోలా ‘మోటో ఇ’.. లోపించిన ఫీచర్లేంటి?

హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ ఫీచర్

హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్‌ను ఆశించే వారికి మోటో ఇ స్మార్ట్‌ఫోన్ పెద్ద నిరాశనే మిగుల్చుతుంది. ఎందుకుంటే ఈ మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌లో హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ ఫీచర్ లోపించింది.

 

మోటరోలా ‘మోటో ఇ’.. లోపించిన ఫీచర్లేంటి?

మోటరోలా ‘మోటో ఇ’.. లోపించిన ఫీచర్లేంటి?

ఫ్లాష్ సపోర్ట్ లేదు

మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కెమెరాకు ఫ్లాష్ సపోర్ట్ లేదు. దీంతో తక్కువ వెళుతురులో ఆశాజనకమైన ఫోటోగ్రఫీని యూజర్ ఆశించలేడు.

 

మోటరోలా ‘మోటో ఇ’.. లోపించిన ఫీచర్లేంటి?
 

మోటరోలా ‘మోటో ఇ’.. లోపించిన ఫీచర్లేంటి?

తక్కువ మెమరీ

మెటో ఇ స్మార్ట్‌ఫోన్ 4జీబి ఇంటర్నల్ మెమరీని ఆఫర్ చేస్తోంది. అయితే, ఇందులో 2.2జీబి వరకు మాత్రమే యాక్సిస్ చేసుకునే అవకాశం ఉంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X