మోటరోలా మోటో జీ@రూ.12,499
మోటరోలా అభిమానులను గత కొంత కాలంగా ఊరిస్తున్న స్మార్ట్‌ఫోన్ ‘మోటో జీ' బుధవారం ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. 8జీబి వేరియంట్ ధర రూ.12,499. 16జీబి వేరియంట్ ధర రూ.13,999. విడుదల సందర్భంగా ఈ రోజు మోటో జీ ఫోన్‌ను ప్రత్యేకించి ఇ-కామర్స్ వెబ్‌సైట్ Flipkart వద్ద విక్రయించనున్నారు.

మోటో జీ కీలక స్పెసిఫికేషన్‌లు:
4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్, 329 పీపీఐ పిక్సల్ డెన్సిటీ),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి),
5 మెగతా పిక్సల్ రేర్ కమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్,
2070ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టంకు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం).
‘మోటో జీ' ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 4.5 అంగుళాల డిస్‌ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్, 329 పీపీఐ), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (త్వరలో ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టంకు అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం), స్నాప్‌డ్రాగెన్ 400 ఎస్ఓసీ విత్ 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 720 పిక్సల్ వీడియో రికార్డింగ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి). 4జీ, ఎల్టీఈ కనెక్టువిటీ ఫీచర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వై-ఫై ఫీచర్‌ను పొందుపరిచారు. 7 కలర్ చేంజబుల్ బ్యాక్ కవర్స్, వాటర్ రిపెల్లంట్ కోటింగ్. 2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 64జీబి క్లౌడ్ స్టోరేజ్, శక్తివంతమైన బేసిక్ ఫీచర్లు: మోటో జీ రూపకల్పనలో భాగంగా కంపెనీ సాఫ్ట్‌వేర్ బృందం అత్యధిక సమయాన్ని సాఫ్ట్‌వేర్ బేసిక్ ఫీచర్లను శక్తివంతంగా తీర్చిదిద్దేందుకే కేటాయించింది. మోటో జీ గెలాక్సీ ఎస్4తో పోలిస్తే వేగవంతంగా బూట్ కాగలదని మోటరోలా సాఫ్ట్‌వేర్ బృందం అంటోంది.
మోటరోలా మైగ్రేట్: మోటో జీ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన సరికొత్త ‘మైగ్రేట్ అప్లికేషన్' మీ పాత ఫోన్‌లోని ముఖ్యమైన డేటాను కొత్త ఫోన్‌లోకి వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసేందుకు దోహదపడుతుంది. శక్తివంతమైన ఇమేజింగ్ అప్లికేషన్ మోటరోలా తమ సరికొత్త మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన ఇమేజింగ్ అప్లికేషన్‌ను దోహదం చేసింది. ఈ కెమెరా అప్లికేషన్ ద్వారా మరింత సౌకర్యవంతమైన ఫోటోగ్రఫీని వినియోగదారుదు ఆశించవచ్చు.
అదనపు డ్రైవ్ స్టోరేజ్: మోటో జీ వినియోగదారులు 50జీబి అదనపు స్టోరేజ్‌ను గూగుల్ డ్రైవ్ ద్వారా పొందవచ్చు. మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసిన ఎఫ్ఎమ్ అప్లికేషన్ ద్వారా ఇష్టమైన లోకల్ రేడియో స్టేషన్‌లను ట్యూన్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications