ఆన్‌లైన్ మార్కెట్లోకి ‘మోటరోలా మోటో జీ’ స్మార్ట్‌ఫోన్

Posted By:

మోటరోలా అభిమానులు గొత కొంత కాలంగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ ‘మోటరోలా మోటో జీ' ఎట్టకేలకు ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతుంది. ShopYourWorld  ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.17,089కి ఆఫర్ చేస్తోంది. ఏ ఇతర ఆన్‌లైన్ రిటైలర్ ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.

మధ్యముగింపు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని రూపకల్పన చేయబడిన మోటరోలా మోటో జీ స్మార్ట్‌ఫోన్ అత్యుత్తమ స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లను కలిగి ఉంది. మోటరోలా ఇండియా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా జనవరి ఆరంభంలో విడుదల చేసే అవకాశముంది. ‘మోటో జీ' ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే:

4.5 అంగుళాల డిస్‌ప్లే (720 పిక్సల్ హైడెఫినిషన్ రిసల్యూషన్, 329పీపీఐ),
ఆండ్రాయిట్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
50జీబి గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ (రెండు సంవత్సరాల వ్యాలిడిటితో),
2070ఎమ్ఏహెచ్ బ్యాటరీ (8 గంటల బ్యాకప్, 10 గంటల టాక్‌టైమ్),
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
ఫోన్ ధర రూ.17089.

ఈ ఫోన్‌కు సంబంధించి మరిన్ని అప్‌డేట్‌లను తెలుసుకునేందుకు తెలుగు గిజ్‌బాట్‌తో టచ్‌లో ఉండండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot