మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లకు నెట్‌వర్క్ సమస్యలు

Posted By:

మోటరోలా నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ‘మోటో జీ'కి సంబంధించి పలు యూనిట్లలో కనెక్టువిటీ సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. లోపాలతో డెలివరీ కాబడిన మోటో జీ యూనిట్లలో ప్రోగ్రామింగ్ ఎర్రర్‌ను గుర్తించారు. ఆయా ఫోన్‌లలోని ఐఎమ్ఈఐ నెంబర్లు రిజిస్టర్ కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దిద్దుబాటు చర్యల్లో భాగంగా కనెక్టువిటీ సమస్యలను ఎదుర్కొంటున్న మోటో జీ యూనిట్లుకు రూ.1200 చొప్పున క్యాష్ బ్యాక్‌ను మోటరోలా అందిస్తోంది. ఆయా యూనిట్లను త్వరలోనే రిపేర్ చేసిస్తారు. అప్పటి వరకు ఎదురుచూడలేని వినియోగదారులు తమ ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్‌కు వాపస్ ఇచ్చేసి చెల్లించిన మొత్తాన్ని తిరిగిపొందవచ్చని కంపెనీ తెలిపింది.

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లకు నెట్‌వర్క్ సమస్యలు

మోటరోలా మోటో జీ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 4.5 అంగుళాల డిస్‌ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్, 329 పీపీఐ), ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగెన్ 400 ఎస్ఓసీ విత్ 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 720 పిక్సల్ వీడియో రికార్డింగ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి) .4జీ, ఎల్టీఈ కనెక్టువిటీ ఫీచర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వై-ఫై ఫీచర్‌ను పొందుపరిచారు. 7 కలర్ చేంజబుల్ బ్యాక్ కవర్స్, వాటర్ రిపెల్లంట్ కోటింగ్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot