మోటో జీ ఫోన్‌లకు భారీ డిమాండ్!
దాదాపు రెండు సంవత్సరాల విరామం తరువాత మోటరోలా కంపెనీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన మోటో జీ స్మార్ట్‌ఫోన్‌కు భారతీయుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్ విక్రయాలు గురువారం నుంచి ప్రారంభించింది. అయితే, మొదిటి గంటలనే మొత్తం యూనిట్లు అమ్ముడుపోవడంతో సదరు వెబ్‌సైట్ ‘అవట్ ఆఫ్ స్టాక్' బోర్డును పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, మధ్యాహ్నం నుంచి మరిన్ని స్టాక్‌లు అందుబాటులోకి తెస్తామని వెబ్‌సైట్ పేర్కొంది. మోటో జీ 8జీబి వేరింయట్ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇక మోటో జీ హ్యాండ్‌సెట్‌ను బుధవారం Flipkart భాగస్వామ్యంతో మోటరోలా మొబిలిటీ ఇండియన్ మార్కట్లో విడుదల చేసింది. 8జీబి వేరియంట్ ధర రూ.12,499. 16జీబి వేరియంట్ ధర రూ.13,999.
మోటో జీ కీలక స్పెసిఫికేషన్‌లు:
4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్, 329 పీపీఐ పిక్సల్ డెన్సిటీ),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి),
5 మెగతా పిక్సల్ రేర్ కమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్,
2070ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టంకు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం).
నీటి తాకిడికి గురైనా దెబ్బతినకుండా విధంగా మోటో జీని కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో రూపొందించారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications