ప్రముఖ మోటరోలా స్మార్ట్‌ఫోన్ పై రూ.5,000 తగ్గింపు

మోటరోలా నుంచి లాంచ్ అయిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ Moto G Turbo ఏకంగా రూ.5,000 తగ్గింపుతో మార్కెట్లో ట్రేడ్ అవుతోంది. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.14,499గా ఉంది.

 ప్రముఖ మోటరోలా స్మార్ట్‌ఫోన్ పై రూ.5,000 తగ్గింపు

Read More : ఎయిర్‌టెల్ 4జీ, ఏడాది పాటు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ

తాజా ధర తగ్గింపులో భాగంగా ప్రముఖ ఈకామర్స్ సైట్ Snapdeal మోటో జీ టర్బోను రూ.9,499కే ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ చాలా రోజుల వరకు Flipkartలో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా దొరికేది. ఇప్పుడు స్నాప్‌డీల్ వద్ద కూడా దొరుకుతోంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ వద్ద మాత్రం ప్రస్తుతానికి రూ.9,999 ధర ట్యాగ్‌తో ట్రేడ్ అవుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టర్బో పవర్ టెక్నాలజీ

మోటరోలా తన మోజీ సిరీస్ నుంచి 'టర్బో ఎడిషన్' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను 2014లో మార్కెట్లోకి తీసుకువచ్చింది. శక్తివంతమైన ఆక్టాకోర్ ప్రాసెసర్, బ్యాటరీని వేగవంతంగా చార్జ్ చేయగలిగే టర్బో పవర్ టెక్నాలజీ, ఐపీ67 రేటింగ్‌తో కూడిన వాటర్ ఇంకా డస్ట్‌ప్రూఫ్ కోటింగ్ వంటి ఎన్నెన్నో ప్రత్యేకతలను మోటరోలా ఈ డివైస్‌లో పొందుపరిచింది.

పర్‌ఫెక్ట్ చాయిస్

మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 2జీబి ర్యామ్‌తో వస్తోంది. మల్టీ టాస్కింగ్‌కు ఈ ఫోన్ పర్‌ఫెక్ట్ చాయిస్. మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఐపీఎక్స్7 సర్టిఫికేషన్‌తో కూడిన వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో వస్తోంది. 3 అడుగుల నీటిలో 30 నిమిషాలు పాటు ఉన్నప్పటికి ఫోన్‌కు ఏం కాదు.

శక్తివంతమైన బ్యాటరీ..

టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 2470 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఈ బ్యాటరీలో పొందుపరిచన టర్బో ఛార్జింగ్ టెక్నాలజీ 15 నిమిషాల వ్యవధిలో 6 గంటలకు సరిపోయే ఛార్జింగ్గ ను సమకూరుస్తుంది. కాబట్టి బ్యాటరీ బ్యాకప్ సమస్యే ఉండదు.

కెమెరా

మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలగి ఉంటుంది. ( కెమెరాలోని ప్రత్యేకతలు: క్విక్ క్యాప్చర్ సపోర్ట్, ఆటో ఫోకస్, 4ఎక్స్ డిజిటల్ జూమ్, స్లో మోషన్ వీడియో రికార్డింగ్, బరస్ట్ మోడ్, పానోరమా, హెచ్ డిఆర్, వీడియో ఐహెచ్ డీఆర్, టైమర్).

స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే ...

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1.1 ఆపరేటింగ్ సిస్టం, 1.5 GHz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Motorola Moto G Turbo price slashed again, now available at Rs 9,499. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot