మోటరోలా మోటో జీ2.. అతి త్వరలో!

Posted By:

మోటో శ్రేణి స్మార్ట్ మొబైలింగ్ ఉత్పత్తులతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను తనవైపుకు తిప్పుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మోటరోలా రెండవ తర మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నద్దమవుతోంది. మోటో జీ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా రాబోతున్న మోటీ జీ2 స్మార్ట్‌ఫోన్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి.

 మోటరోలా మోటో జీ2.. అతి త్వరలో!

తాజా రూమర్ ఏమి చెబుతుందంటే..?

మోటో జీ2 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఇప్పటికే అనేక రూమర్లు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా తెలియవచ్చిన సమాచారం మేరకు మోటో జీ2, సెప్టంబర్ 10నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే నెలలో యాపిల్ తన ఐఫోన్ 6ను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.

మోటో జీ2 స్పెసిఫికేషన్‌లు..? (అంచనా మాత్రమే)

720 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన 5 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

రిటైల్ మార్కెట్లో మోటో జీ2 ధర..? (అంచనా మాత్రమే)

ఇండియన్ మార్కెట్లో మోటో జీ2 ఫోన్ ధర రూ.20,000 వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాల విశ్లేషణ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot