రూ.12,499కే మోటో జీ4, బెస్ట్ ఫీచర్లు ఇవే!

మోటో జీ4 ప్లస్‌తో పాటుగా మోటరోలా లాంచ్ చేసిన మోటో జీ4 స్మార్ట్‌ఫోన్ బుధవారం మార్కెట్లో విడుదలయ్యింది. ధర రూ.12,499. ఈ ఫోన్‌లను నేటి అర్థరాత్రి నుంచి Amazon Indiaలో కొనుగోలు చేయవచ్చు.

రూ.12,499కే మోటో జీ4, బెస్ట్ ఫీచర్లు ఇవే!

బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది. మోటో జీ4 ప్లస్ తో పోలిస్తే కొద్దిపాటి మార్పు చేర్పులు ఈ ఫోన్‌లో ఉన్నాయి. మోటో జీ4 స్మార్ట్‌ఫోన్‌లోని 8 బెస్ట్ ఫీచర్లను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : ఇదే ఆ సూపర్ ఫోన్, రూ.6,999కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.12,499కే మోటో జీ4, బెస్ట్ ఫీచర్లు ఇవే!

మోటో జీ4 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్, 401 పీపీఐ. ఏర్పాటు చేసిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది.

రూ.12,499కే మోటో జీ4, బెస్ట్ ఫీచర్లు ఇవే!

మోటో జీ4 స్మార్ట్‌ఫోన్ బరువు ఇంచుమించుగా 157 గ్రాములు ఉంటుంది. మందం 7.9 మిల్లీ మీటర్లు.

రూ.12,499కే మోటో జీ4, బెస్ట్ ఫీచర్లు ఇవే!

మోటో జీ4 స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 617 చిప్‌సెట్‌తో వస్తోంది. ఈ చిప్‌సెట్‌కు అనుసంధానించిన అడ్రినో 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఫోన్ గ్రాఫిక్ విభాగానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది.

రూ.12,499కే మోటో జీ4, బెస్ట్ ఫీచర్లు ఇవే!

మోటో జీ4 స్మార్ట్‌ఫోన్, 2జీబి ర్యామ్‌తో వస్తోంది. 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

రూ.12,499కే మోటో జీ4, బెస్ట్ ఫీచర్లు ఇవే!

మోటో జీ4 స్మార్ట్‌ఫోన్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. డ్యుయల్ టోన్ ఫ్లాష్, ఎఫ్/2.0 అపెర్చుర్, 84 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ కెమెరాలలో ఉన్నాయి.

రూ.12,499కే మోటో జీ4, బెస్ట్ ఫీచర్లు ఇవే!

మోటో జీ4 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

రూ.12,499కే మోటో జీ4, బెస్ట్ ఫీచర్లు ఇవే!

4జీ ఎల్టీఈ విత్ VoLTE, వై-ఫై, బ్లుటూత్ 4.1, జీపీఎస్, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో.

రూ.12,499కే మోటో జీ4, బెస్ట్ ఫీచర్లు ఇవే!

మోటో జీ4 స్మార్ట్‌ఫోన్, టర్బో ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. టర్బో ఛార్జర్ ద్వారా ఫోన్‌ను 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు 6 గంటల యూసేజ్ టైమ్‌ లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Motorola Moto G4 Launched at Rs 12,499: Top 8 Features You Need to Know. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot