వారం రోజుల్లో Motorola కొత్త ఫోన్.. రూ.9,000లోపే

Motorola అప్‌కమింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌పోన్ Moto G4 Play మరికొద్ది రోజుల్లో ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతోంది. మోటరోలా ఇండియా తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్ సెప్టంబర్ 6న ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతోంది.

వారం రోజుల్లో Motorola కొత్త ఫోన్.. రూ.9,000లోపే

Read More : పేరు మార్చుకుని వచ్చేస్తోన్న లెనోవో

ఈ ఫోన్ ధర రూ.9,000లోపు ఉండొచ్చని తెలుస్తోంది. మోటో జీ4, మోటో జీ4 ప్లస్ తరహాలోనే మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Moto G4 Play స్పెసిఫికేషన్స్

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,

ప్రాసెసర్, ర్యామ్

మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్ 1.4గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్‌తో పాటు 2జీబి ర్యామ్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

స్టోరేజ్ ఎంతంటే..?

మోటో జీ4 ప్లే స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా క్వాలిటీ

మోటో  జీ4 ప్లే ఫోన్ 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. 

 

కనెక్టువిటీ ఫీచర్లు

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్.

 

ఈ ఏడాదికిగాను

ఈ ఏడాదికిగాను మోటో జీ సిరీస్ నుంచి మోటో జీ4, మోటో జీ4 ప్లస్‌ ఫోన్‌లు ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయ్యాయి. మోటో జీ4 ప్లస్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 2జీబి ర్యామ్, 16జీబి వర్షన్ ధర రూ.13,499గా ఉంటే, 3జీబి ర్యామ్, 32జీబి వర్షన్ ధర రూ.14,999గా ఉంది. మరోవైపు మోటో జీ4 రూ.12,499 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోంది.

వాటి నుంచి తీవ్రమైన పోటీ

మరికొద్ది రోజుల్లో మార్కెట్లో లాంచ్ కాబోతోన్న మోటో జీ4 ప్లస్.. ఇప్పటికే అందుబాటులోన్న Redmi 3S, LeEco Le 1s, Lenovo Vibe K5 Plus ఫోన్‌ల నుంచి తీవ్రమైన పోటీ ఎదురయ్యే అవకాశముంది. అయితే, క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను కోరుకునే వారికి మోటరోలా ఫోన్‌లు బెస్ట్ అని చెప్పొచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Motorola Moto G4 Play to launch in India on September 6. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot