మోటో జీ5, జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఇవేనా..?

2017 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సమీపిస్తోన్న నేపథ్యంలో, అక్కడ చోటుచేసుకుబోయే స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీటిలో మోటరోలా నుంచి రాబోతున్న మోటో జీ5, జీ5 ప్లస్ ఫోన్‌లు కూడా ఉన్నాయి.

Read More : ఆధార్ కార్డులో తప్పులా..? మీరే సరిచేసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Moto G5 లైనప్ నుంచి..

బార్సిలోనా వేదికగా జరగనున్న MWC 2017ను పురస్కరించుకుని లెనోవో తన Moto G5 లైనప్ నుంచి మోటో జీ5, జీ5 ప్లస్ ఫోన్‌లను లాంచ్ చేయబోతోన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్‌లకు సంబంధించి స్పెక్స్, ధర ఇంకా డిజైనింగ్‌కు సంబంధించిన వివరాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

Brazilian retailer ప్రకారం..

Brazilian retailer రివీల్ చేసిన వివరాల ప్రకారం మోటో జీ5, జీ5 ప్లస్ ఫోన్‌ల ధరలు బ్రెజిల్ మార్కెట్లో ఈ విధంగా ఉంటాయి. మోటో జీ5 వేరియంట్ ధర బీఆర్ఎల్ 1099 (మన కరెన్సీలో రూ.23,743), మోటో జీ5 ప్లస్ వేరియంట్ ధర బీఆర్ఎల్ 1499 (మన కరెన్సీలో రూ.32,132)

మోటో జీ5, జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్ (అన్‌అఫీషియల్)

స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్, 3,050mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5 అంగుళాల FHD 1080 పిక్సల్ డిస్‌ప్లే (మోటో జీ5), 5.5 అంగుళాల FHD 1080 పిక్సల్ డిస్ ప్లే (మోటో జీ5 ప్లస్ వేరియంట్), యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 7.0 Nougat ఆపరేటింగ్ సిస్టం,

ప్రపంచానికి మొట్ట మొదటి మొబైల్ ఫోన్‌

ప్రపంచానికి మొట్ట మొదటి మొబైల్ ఫోన్‌ను అందించిన విప్లవాత్మక బ్రాండ్‌గా మోటరోలా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. మొబైల్ మార్కెట్లోకి నోకియా, సామ్‌సంగ్‌లు అడుగుపెట్టకముందే తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మోటరోలా కాలక్రమంలో ఆర్థిక ఇబ్బందులు కారణంగా మూతపడాల్సివచ్చింది.

వ్యూహాత్మక ఎత్తుగడలతో ...

ఆ తరువాత వ్యూహాత్మక ఎత్తుగడలతో మోటరోలా పగ్గాలను అందిపుచ్చుకున్న గూగుల్ మోటో జీ పేరుతో ఆండ్రాయిడ్ ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసి మోటరోలాకు మంచి బ్రేక్ తీసుకువచ్చింది. చైనా మార్కెట్ పై పట్టు సాధించే క్రమంలో మోటరోలా మొబిలిటీ డివిజన్‌ను లెనోవోకు విక్రయించిన గూగుల్, మోటరోలా బ్రాండ్ ఇమేజ్‌ను ఒక్కసారిగా పెంచేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Motorola Moto G5 and G5 Plus: price, specs and launch date. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot