Home
Mobile

ఆ సంచలన ఫోన్ ఏప్రిల్ 4న వస్తోంది !

mwc 2017 ఈవెంట్ లో కంపెనీ మోటో జీ5, మోటో జీ5 ప్లస్ లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

By Hazarath

mwc 2017 ఈవెంట్ లో కంపెనీ మోటో జీ5, మోటో జీ5 ప్లస్ లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వినియోగదారులను ఊరిస్తూ వస్తున్న ఈ ఫోన్లలో ఎట్టకేలకు మోటో జీ5 ప్లస్ మార్చి 15న రూ. 14,999 ధరతో ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లాంచ్ అయింది. అమ్మకాల్లో దుమ్ము రేపింది కూడా.. అయితే మోటో జీ5ని ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న విషయం మాత్రం ఇప్పటిదాకా కంపెనీ చెప్పలేదు. ఎట్టకేలకు ఇప్పుడు కంపెనీ విడుదల తేదీని ప్రకటించింది. ఏప్రిల్ 4న అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. మరి ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ సారి చూడండి.

ఎయిర్‌టెల్‌కి జియో దిమ్మతిరిగే షాక్ !

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేలతో

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేలతో

మోటో జీ5 అలానే జీ5 ప్లస్ వర్షన్‌లు ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేలతో వస్తున్నాయి. మోటో జీ5 మోడల్ 5 అంగుళాల (1080x1920పిక్సల్స్) డిస్‌ప్లేతో వస్తోండగా, మోటో జీ5 ప్లస్ మోడల్ 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్‌తో వస్తోంది. ఫోన్ డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్స్ అలానే జెంటిల్ కర్వుస్ ఆకట్టుకుంటాయి.

ఆండ్రాయిడ్ నౌగట్

ఆండ్రాయిడ్ నౌగట్

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోన్న ఈ 5వ తరం మోటో జీ హ్యాండ్‌సెట్‌‌లు ఆధునీకరించబడిన డిజైనింగ్‌తో పాటు బెటర్ క్వాలిటీ హార్డ్‌వేర్ ఫీచర్లను కలిగి ఉన్నాయి.

కెమెరా క్వాలిటీ

కెమెరా క్వాలిటీ

ఫోటోగ్రఫీ విషయానికి వచ్చేసరికి, మోటో జీ5 ఫోన్.. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్.. 12 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్‌తో పాటు, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. మోటో జీ5 ప్లస్ కెమెరా ద్వారా 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

ర్యామ్, ప్రాసెసర్

ర్యామ్, ప్రాసెసర్

మోటో జీ5 ఫోన్ 1.4GHz స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్ మోడల్ 2GHz ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ర్యామ్ విషయానికి వచ్చేసరికి మోటో జీ5 ఫోన్ 2జీబి అలానే 3జీబి ర్యామ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్ 3జీబి అలానే 4 జీబి ర్యామ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది.

స్టోరేజ్ వేరియంట్స్

స్టోరేజ్ వేరియంట్స్

స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి.. మోటో జీ5, మోటో జీ5 ప్లస్ మోడల్స్ 16జీబి, 32జీబి, 64జీబి స్టోరేజ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటాయి. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

బ్యాటరీ బ్యాకప్..

బ్యాటరీ బ్యాకప్..

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి.. మోటో జీ5 మోడల్ 2,800mAh బ్యాటరీ యూనిట్‌తో వస్తోంది. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్ మోడల్ 3,000mAh బ్యాటరీ యూనిట్‌తో వస్తోంది. టర్బో ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తోన్న ఈ రెండు ఫోన్‌లలో బ్యాటరీ వేగవంతంగా ఛార్జ్ అవుతుంది. ఈ రెండు ఫోన్‌లు 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Moto G5 launch on April 4 in India, will be Amazon exclusive read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X