ఆగష్టు 29న Moto G5S Plus, అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్

మోటో జీ5 ప్లస్‌తో మోటో జీ5ఎస్ ప్లస్‌ను కంపేర్ చేసి చూసినట్లయితే జీ5ఎస్ ప్లస్‌ మోడల్‌లో పెద్దదైన తాకేతెరతో పాటు డ్యుయల్ కెమెరా ఇంకా బెటర్ క్వాలిటీ సెల్ఫీ కెమెరాలు ఉంటాయి.

|

మోటో జీ5, జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లకు సక్సెసర్ మోడల్స్‌గా త్వరలో ఇండియాకు రాబోతోన్న మోటో జీ5ఎస్, జీ5ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఆసక్తికర న్యూస్‌ రివీల్ అయ్యింది. వీటిలో ఒక మోడల్ అయిన Moto G5S Plusను ఆగష్టు 29న ఇండియన్ మార్కెట్ లాంచ్ చేయబోతోన్నట్లు మోటరోలా ఇండియా కన్ఫర్మ్ చేసింది. అమెజాన్ ఇండియాలో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

SMS ద్వారా జియోఫోన్‌ను బుక్ చేసుకోవటం ఎలా..?SMS ద్వారా జియోఫోన్‌ను బుక్ చేసుకోవటం ఎలా..?

#FindYourFocus అనే హ్యాష్‌ట్యాగ్‌తో

#FindYourFocus అనే హ్యాష్‌ట్యాగ్‌తో

ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు సంబంధించి ఓ టీజర్‌ను #FindYourFocus అనే హ్యాష్‌ట్యాగ్‌తో అమెజాన్ ఇప్పటికే తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. మోటో జీ5 ప్లస్‌తో మోటో జీ5ఎస్ ప్లస్‌ను కంపేర్ చేసి చూసినట్లయితే జీ5ఎస్ ప్లస్‌ మోడల్‌లో పెద్దదైన తాకేతెరతో పాటు డ్యుయల్ కెమెరా ఇంకా బెటర్ క్వాలిటీ సెల్ఫీ కెమెరాలు ఉంటాయి.

Moto G5S Plus స్పెసిఫికేషన్స్...

Moto G5S Plus స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌గ్రేడబుల్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ.

మోటో జీ5ఎస్ ప్లస్‌కు పోటీగా  షియోమీ Mi 5X
 

మోటో జీ5ఎస్ ప్లస్‌కు పోటీగా షియోమీ Mi 5X

ఇండియన్ మార్కెట్లో మోటో జీ5ఎస్ ప్లస్ ధర రూ.17,999గా ఉండొచ్చని తెలుస్తోంది. మోటో జీ5ఎస్ ప్లస్‌కు పోటీగా షియోమీ Mi 5X పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

Xiaomi Mi 5X స్పెసిఫికేషన్స్..

Xiaomi Mi 5X స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ1080x 1920పిక్సల్స్), ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, వై-ఫై, జీపీఎస్, ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, డీహెచ్ఎస్ ఆడియో క్యాలిబ్రేషన్ అల్గారిథమ్, 3080mAh బ్యాటరీ, మెటల్ యునిబాడీ డిజైన్ విత్ కర్వుడ్ ఎడ్జెస్. చైనా మార్కెట్లో Mi 5X ధర CNY 1,499గా ఉంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.14,200.

Best Mobiles in India

English summary
Motorola Moto G5S Plus India Launch Date Set for August 29. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X