మోటో ఎక్స్ (2014) ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం
మోటరోలా ఇటీవల ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించిన స్మార్ట్‌ఫోన్ మోటో ఎక్స్ 2014 ఎడిషన్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ మందస్తు బుకింగ్‌ల పై ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ధర రూ.33,999. బాంబో వైట్ ఇంకా బ్లాక్ లెదర్ ఫినిష్ వేరియంట్‌లలో లభ్యమయ్యే ఈ ఫోన్‌లను ఆక్టోబర్ 2వ వారం నుంచి డెలివరీ చేస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు క్యాష్ బ్యాక్ రాయితీతో కూడిన ప్రత్యేక ఈఎమ్ఐ సదుపాయాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది.

మోటో ఎక్స్ 2014 ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.. 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), కర్వుడ్ మెటల్ ఫ్రేమ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్ 4.0, జీపీఎస్), 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 144 గ్రాములు, ఫోన్ మందం 9.9 మిల్లీ మీటర్లు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications