ఫ్లిప్‌కార్ట్‌లో మోటో సేల్ , తగ్గింపు పొందిన ఫోన్లు ఇవే !

Written By:

మార్కెట్లో లభిస్తున్న అనేక రకాలైన కంపెనీ ఫోన్లలో ఒక్కో కంపెనీని కొంతమంది ఇష్టపడుతుంటారు. ఆ కంపెనీ నుంచి ఎటువంటి ఫోన్లు వచ్చినా ముందుగా కొనేస్తుంటారు. ఈ నేపథ్యంలో మోటోరోలా ఫోన్లు అంటే చాలామంది ఇష్టపడుతుంటారు కదా.. ఈఫోన్లు డిస్కౌంట్లో లభిస్తున్నాయా అని చాలామంది ఆన్ లైన్లలో తెగ వెతికేస్తుంటారు. అలాంటి వారికోసం ఫ్లిప్‌కార్ట్‌ మోటో సేల్ ప్రకటించింది. ఈ సేల్ లో మోటో ఫోన్లపై కంపెనీ రాయితీలను అందిస్తోంది. అలాగే ఎయిర్టెల్ కూడా భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. కాగా ఈ ఆఫర్ నేటితో ముగియనుంది. ఈ ఆఫర్లో భాగంగా డిస్కౌంట్లో లభిస్తున్న మోటో ఫోన్లపై ఓ లుక్కేద్దామా.

గూగుల్ ఇమేజ్ సెర్చి మాయం అయ్యిందా..అయితే వెతకండిలా !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో ఎక్స్ 4

ఈ ఫోన్ అసలు ధర రూ. 20,999
తగ్గింపు తర్వాత ధర రూ. 18,999
డిస్కౌంట్ రూ. 2000
అలాగే రూ. 2000 ఎక్సేంజ్ సదుపాయం కూడా కలదు.

మోటో ఎక్స్4 ఫీచర్లు
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌టీపీఎస్ ఐపీఎస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

Moto Z2 Play

ఈ ఫోన్ అసలు ధర రూ. 27,999
తగ్గింపు తర్వాత ధర రూ. 22,999
డిస్కౌంట్ రూ. 5000
అలాగే రూ. 2000 ఎక్సేంజ్ సదుపాయం కూడా కలదు.

Moto Z2 Play స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల 1080 పిక్సల్స్ సూపర్ అమోల్డ్ డిస్‌‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 626 సాక్,ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ డ్యుయల్-పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh విత్ టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్, కనెక్టువిటీ ఆప్షన్స్ (4జీ ఎల్టీఈ విత్ వోల్ట్, డ్యుయల్ సిమ్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్).

మోటో ఈ4 ప్లస్

ఈ ఫోన్ అసలు ధర రూ. 9,999
తగ్గింపు తర్వాత ధర రూ. 9,499
డిస్కౌంట్ రూ. 500
అలాగే రూ. 2000 ఎక్సేంజ్ సదుపాయం కూడా కలదు.

మోటో ఈ4 ప్లస్ ఫీచర్లు

5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా విత్ ఫ్లాష్, వాటర్ రీపెల్లెంట్ కోటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ర్యాపిడ్ చార్జింగ్.

 

ఎయిర్టెల్ భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లను..

కాగా మోటో సీ, మోటో ఈ4, లెనోవా కె8 ఫోన్లపై ఎయిర్టెల్ భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా మోటో సీను వినియోగదారులు రూ.3999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే మోటో ఈ4 కూడా రూ.6499కు, లెనోవా కె8 రూ. 10,999కే సొంతం చేసుకోవచ్చు.

మోటొరోలా, లెనోవో స్మార్ట్‌ఫోన్లతో ఎంజాయ్‌ చెయ్యండి'

జీ స్మార్ట్‌ఫోన్లను మరింతగా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు మోటొరోలాతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని భారతీ ఎయిర్‌టెల్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ వాని వెంకటేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు 4జీ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు ఇది మంచి అవకాశం. మోటొరోలా, లెనోవో స్మార్ట్‌ఫోన్లతో ఎంజాయ్‌ చెయ్యండి' అని మోటొరోలా మొబిలిటీ ఇండియా, లెనోవో ఎంబీజీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుధిన్‌ మాథుర్‌ తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Motorola Moto X4, E4 Plus, Z2 Play now available at discounted prices on Flipkart More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot