మోటరోలా మోటో XT535 ‘ప్రివ్యూ’!!!

Posted By: Staff

మోటరోలా మోటో  XT535 ‘ప్రివ్యూ’!!!

 

మోటరోలా ఇటీవల లాంఛ్ చేసిన స్మార్ట్ ఫోన్ ‘మోటో XT535’ ఫిబ్రవరి మొదటి వారంలో మార్కెట్లోకి రానుంది. మోటరోలా మునుపటి మోడల్ ‘డెఫీ మినీ’ని పోలి ఉన్న ఈ స్మార్ట్‌డివైజ్ అత్యాధునిక ఫీచర్లను ఒదిగి ఉంది.

మొబైల్ స్పెసిఫికేషన్‌లు:

* ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం, * క్వాల్కమ్ ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ 800 MHz),* 4.5 అంగుళాల ఎల్ సీడీ టచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 854 పిక్సల్స్), * 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, * 3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, * వీడియో రికార్డింగ్, * ఆడియో ప్లేయర్, * వీడియో ప్లేయర్, * 512 ఎంబీ ర్యామ్, * వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ కనెక్టువిటీ, * ఇన్‌బుల్ట్ సోషల్ నెట్ వర్కింగ్ ఆప్లికేషన్స్, * జీఎస్ఎమ్ నెట్‌వర్క్, * మోనో బ్లాక్ డిజైన్, * బరువు 109 గ్రాములు, * టచ్ సెన్సిటివ్ కంట్రోల్స్.

సాధారణ మోనో‌బ్లాక్ డిజైన్‌లో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ డివైజ్ చేతికి సౌకర్యవంతంగా ఇముడుతుంది. మన్నికైన రిసల్యూషన్ కలిగిన స్ర్కీన్ క్లారిటీతో కూడిన విజువల్స్‌ను అందిస్తుంది. జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌ను ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది.

పటిష్టమైన 512 ఎంబీ ర్యామ్, శక్తివంతమైన క్వాల్కమ్ ప్రాసెసర్ వ్యవస్థలు ఫోన్ సమర్దవంతంగా పనిచేసేందుకు దోహదపడతాయి. లోడ్ చేసిన ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం యూజర్ ఫ్రెండ్లీ మొబైలింగ్‌కు దోహదపడుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల కాబోతున్న ఈ మొబైల్ ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot