మోటరోలా నుంచి మరో సంచలనం!

Written By:

శాన్‌ఫ్రాన్సిస్కొలో జరుగుతోన్న టెక్ వరల్డ్ 2016 కాన్ఫిరెన్స్‌లో భాగంగా లెనోవో నేతృత్వంలోని మోటరోలా, మోటో జెడ్ (Moto Z) పేరుతో సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను అనౌన్స్ చేసింది.

మోటరోలా నుంచి మరో సంచలనం!

గతంలో విడుదలైన Moto X ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా లాంచ్ అయిన ఈ ఫోన్ విప్లవాత్మక ఫీచర్లతో సరికొత్త ఒరవడికి నాంది పలికింది. సెప్టంబర్‌లో మార్కెట్లోకి రాబోతున్న ఈ ఫోన్‌కు సంబంధించి ఆసక్తికర వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : యూట్యూబ్ వీడియోలను తక్కువ డేటా ఖర్చుతో డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రీమియమ్ ఇంకా డ్యురబుల్ డిజైన్

మోటరోలా Moto Z ప్రత్యేకతలు

ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యుమినియమ్ అలానే స్టెయిన్‌లెస్ స్టీల్ లోహాలతో రూపొందించబడిన ఈ స్మార్ట్‌ఫోన్ 5.2 మిల్లీమీటర్ల మందంతో మన్నికకు మారుపేరుగా నిలుస్తుంది.

 

అద్భుతమైన వైబ్రెంట్ డిస్‌ప్లే

మోటరోలా Moto Z ప్రత్యేకతలు

మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ అమోల్డ్ 1440 పిక్సల్ డిస్‌ప్లేతో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ డిస్‌‍ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది. డిస్‌ప్లేలో పొందుపరిచిన 535 పీపీఐ హై పిక్సల్ డెన్సిటీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

ప్రాసెసర్, ర్యామ్

మోటరోలా Moto Z ప్రత్యేకతలు

మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన 2.2గిగాహెర్ట్జ్ సామర్థ్యం గల క్వాల్కమ్ క్వాడ్‌కోర్ స్నాప్ డ్రాగన్820 ప్రాసెసర్‌ను పొందుపరిచారు. అడ్రినో 530 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని బలోపేతం చేస్తుంది. 4జీబి ర్యామ్ ఫోన్ మల్టీ టాస్కింగ్ సామర్థ్యాలను రెట్టింపు చేస్తుంది.

స్టోరేజ్ ఇంకా ఆపరేటింగ్ సిస్టం

మోటరోలా Moto Z ప్రత్యేకతలు

మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్ Android 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికొస్తే రెండు స్టోరేజ్ వర్షన్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. మొదటి వర్షన్ 32జీబి, రెండవ వర్షన్ 64జీబి. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2 TB వరకు విస్తరించుకునే అవకాశం.

కెమెరా విభాగాలు

మోటరోలా Moto Z ప్రత్యేకతలు

మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. (కెమెరా ప్రత్యేకతలు : డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, లేజర్ ఆటో ఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎఫ్.8 అపెర్చుర్), ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ద్వారా తక్కువ వెళుతురులోనూ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు. (కెమెరా ప్రత్యేకతలు : వైడ్ యాంగిల్ లెన్స్, f/2.2 అపెర్చుర్).

వాటర్ రిపెల్లెంట్

మోటరోలా Moto Z ప్రత్యేకతలు

వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్‌తో వస్తోన్నఈ ఫోన్ నీటిలో తడిచినప్పటికి ఎటువంటి ప్రమాదం వాటిల్లదు.

Moto Mods

మోటరోలా Moto Z ప్రత్యేకతలు

మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్‌కు Moto Mods పేరుతో పలు రకాల మాడ్యులర్ యాక్సెసరీస్‌ను మోటరోలా అందిస్తోంది. వీటితో మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్‌ను కావల్సిన విధంగా మార్చుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన మాడ్యులర్ కేసెస్‌తో ఫోన్‌ను ఇన్‌స్టెంట్ పవర్ బ్యాంక్‌లా, సౌండ్ బూస్టర్‌లా, ప్రొజెక్టర్‌లా, అధిక ఫ్లాషెస్‌తో కూడిన కెమెరా లెన్స్‌లా మార్చేసుకోవచ్చు.

ఫింగర్ ప్రింట్ స్కానర్‌

మోటరోలా Moto Z ప్రత్యేకతలు

మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్ హై సెక్యూర్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోంది. ఈ స్కానర్ ద్వారా జస్ట్ సింగిల్ టచ్‌తో ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.

టర్బో ఛార్జింగ్ బ్యాటరీ

మోటరోలా Moto Z ప్రత్యేకతలు

మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. టర్బో ఛార్జింగ్ ఫెసిలిటీతో వస్తోన్న ఈ ఫోన్‌ను 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు 8 గంటల బ్యాకప్‌ను పొందవచ్చు.

మోటో జెడ్ కనెక్టువిటీ ఫీచర్లు

మోటరోలా Moto Z ప్రత్యేకతలు

4జీ ఎల్టీఈ, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్‌లో మోటరోలా అందిస్తోంది. ఫోన్ ముందు భాగంలో ఫ్రంట్ ఫేసింగ్ లౌడ్ స్పీకర్స్ ఆకట్టుకుంటాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Motorola Moto Z: 10 Promising Features to Know About the Flagship Smartphone. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting