జూన్ 8 నుంచి Moto Z2 Play ప్రీ-ఆర్డర్స్

Moto Z Playకు సక్సెసర్ వర్షన్‌గా మోటరోలా లాంచ్ చేసిన Moto Z2 Play ఫోన్ మరో మూడు రోజుల్లో ఇండియాకు రాబోతోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రీ-బుకింగ్స్ జూన్ 8 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఫోన్‌ను ఆర్డర్ చేసుకోవాలనుకునే వారు అడ్వాన్సు క్రింద రూ.2.,000 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిని మొత్తాన్ని 10 వాయిదాల్లో సున్నా వడ్డీతో చెల్లించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Moto Armor packతో

మోటరోలా ఈ ఫోన్‌తో పాటు Moto Armor packను కూడా అందిస్తోంది. ఈ ప్యాక్‌లో ఫోన్‌కు సంబంధించి ప్రొటెక్టివ్ యాక్సెసరీస్ ఉంటాయి.

నాలుగు సరికొత్త మోడ్స్‌..

సెకండ్ జనరేషన్ మోటొ జెడ్ లైనప్ ఫోన్‌ల కోసం నాలుగు సరికొత్త మోడ్స్‌ను కూడా మోటరోలా లాంచ్ చేసింది. వాటి వివరాలు.. JBL సౌండ్ బూస్ట్ 2, మోటో టర్బో పవర్ ప్యాక్, మోటో స్టైల్ షెల్స్ విత్ వైర్ లెస్ ఛార్జింగ్, మోటో గేమ్ ప్యాడ్.

రూ.18,000కే 6జీబి ర్యామ్, 128జీబి స్టోరేజ్ ఫోన్?

నానో కోటింగ్‌తో..

నానో కోటింగ్‌తో వస్తోన్న మోటో జెడ్2 ప్లే స్మార్ట్‌ఫోన్ నీటి ద్వారా సంభవించే ప్రమాదాలను పూర్తిస్థాయిలో తట్టుకుంటుంది. మెటల్ యునిబాడీ డిజైన్ ఈ ఫోన్‌కు మరో ప్రధాన హైలెట్.

Moto Z2 Play స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల 1080 పిక్సల్స్ సూపర్ అమోల్డ్ డిస్‌‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 626 సాక్,

జూన్ 13న నోకియా 6 లాంచ్, ఇదే రోజు నోకియా5, నోకియా 3 కూడా..

Moto Z2 Play స్పెసిఫికేషన్స్...

ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ డ్యుయల్-పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh విత్ టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్, కనెక్టువిటీ ఆప్షన్స్ (4జీ ఎల్టీఈ విత్ వోల్ట్, డ్యుయల్ సిమ్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Motorola Moto Z2 Play to be available for pre-orders in India from June 8. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot