Home
Mobile

Moto Z2 Play లాంచ్ అయ్యింది, ధర రూ.27,999

ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అన్ని ప్రముఖ మొబైల్ స్టోర్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటంది.

By Sivanjaneyulu Bommu

మోటరోలా కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ మార్కెట్లో అనౌన్స్ చేసిన Moto Z2 Play స్మార్ట్‌ఫోన్ గురువారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ధర రూ.27,999. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అన్ని ప్రముఖ మొబైల్ స్టోర్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటంది. జూన్ 14 వరకు ప్రీ-బుకింగ్స్ తీసుకుంటారు. జూన్ 15 నుంచి సేల్ ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ పై 'Hello Finance' పేరుతో ప్రత్యేకమైన ఆఫర్‌ను మోటరోలా అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ క్రింద ముందుగా రూ.2,000 చెల్లించి మోటో జెడ్2 ప్లే స్మార్ట్‌ఫోన్‌ను ప్రీబుక్ చేసుకునే వారు ఎటువంటి వడ్డీ లేకుండా 10 సులభ వాయిదాల్లో మిగిలిన మొత్తాన్ని చెల్లించే వీలుంటుంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్న వారి వద్ద తప్పనిసరిగా బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఉండాలి.

 Moto Z2 Play

లాంచ్ డే ఆఫర్స్‌లో భాగంగా ఈ ఫోన్ పై పలు ఆసక్తికర ఆఫర్లను మోటరోలా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కొన్న వారికి Moto Mods పై 50శాతం వరకు డిస్కౌంట్లను ఇస్తున్నట్లు మోటరోలా తెలిపింది. రిలయన్స్ జియో యూజర్లకు 100జీబి 4జీ డేటాను ఉచితంగా ఇస్తున్నట్లు మోటరోలా తెలిపింది. ఈ 100జీబి డేటాను నెలకు 10జీబి డేటా చొప్పున 10 సార్లు యాడ్ చేసుకోవల్సి ఉంటుంది. మార్చి 31, 2018లోపు రూ.309 పెట్టి రీఛార్జ్ చేయించుకున్న ప్రతిసారి అదనంగాఈ 10జీబి 4జీ డేటా యాడ్ అవుతుంటుంది.

 Moto Z2 Play

స్లీక్ డిజైన్‌‌తో వస్తోన్న మోటో జెడ్2 ప్లే స్మార్ట్‌ఫోన్ 5.99 మిల్లీ మీటర్ల మందంతో కేవలం 145 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ తో ఇన్ బిల్ట్ వస్తోన్న నైట్ డిస్ ప్లే ఫీచర్ రాత్రిపూట లైటింగ్ ను బట్టి స్క్రీన్ ఉష్ణోగ్రతను ఎడ్జస్ట్ చేసుకుంటుంది. Moto Z2 Play స్పెసిఫికేషన్స్... 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే (రిసల్యూషన్ వచ్చేసిరకి 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, డ్యుయల్ ఆటో ఫోకస్ లెన్స్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 3000mAh బ్యాటరీ విత్ టర్బో పవర్ ఛార్జర్, కనెక్టువిటీ ఆప్షన్స్ (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్-సీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్).

Best Mobiles in India

English summary
Motorola Moto Z2 Play with Android 7.1.1 Nougat, Moto Mods support launched in India, price starts at Rs 27,999. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X